ఐడియా

కందిన చర్మానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలం వచ్చేసింది. వేడి, ఉక్కపోతలు పెరిగాయి. ఈ ఎండలో ఎక్కువసమయం నిలబడటం వల్ల చర్మం కందిపోతుంది. సూర్యరశ్మికి బహిర్గతమైన సమయంలో అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం కణాలు ప్రమాదానికి గురవకుండా ఉండటానికి మెలనిన్ ఉత్పత్తి అధికం అవుతుంది. మెలనిన్ అనేది ఒక వర్ణద్రవ్యం. ఇది చర్మ, వెంట్రుకల, కంటి రంగు నిలిపి ఉంచేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో మెలనిన్ సరిపోయేంత స్థాయిలో వేగంగా ఉత్పత్తి జరగదు. ఫలితంగా చర్మంలోని జన్యుపదార్థం దెబ్బతింటుంది. సూర్యకాంతి వల్ల కలిగే చర్మ సమస్యలు.. చర్మ కణాలను ప్రమాదానికి గురి చేసి సమస్యలను పెంచుతాయి. సముద్రతీర స్నానాలు, తరచుగా ఈత కొట్టేవారు, ఎక్కువ సమయం ఎండలో ఉండేవారికి చర్మం కందిపోతుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు రసాయనిక క్రీములను వాడితే లేనిపోని అలర్జీలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం కలిగి ఉన్నవారిలో తీవ్ర సమస్యలు కలుగుతాయి. ఇలాంటి ఖరీదుగల చికిత్సలకు బదులుగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వాడటం ద్వారా సూర్యరశ్మి వల్ల కందిన చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
అతినీలలోహిత కిరణాల వల్ల ఆరోగ్యంగా ఉండే చర్మకణాలకు కలిగే ప్రమాదం నుండి ఉపశమనాన్ని పొందడానికి ఇన్ల్ఫమేషన్‌లకు గురవుతాయి. మరోవైపు శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కొన్నిసార్లు ఈ రెండు పద్ధతుల మధ్య సమతుల్యత లేకుంటే చర్మ కేన్సర్ కలిగే ప్రమాదం కూడా ఉంది. సూర్యకాంతిలో గడిపే సమయం, చర్మధోరణిపై ఆధారపడి చర్మం మంటకు గురవుతుంది. ఒకవేళ చర్మ రంగు తెల్లగా ఉంటే.. మధ్యాహ్న సమయాల్లో కేవలం పదిహేను నిముషాల పాటు ఎండలో ఉండటం వల్ల చర్మం కందిపోతుంది. దీర్ఘకాలిక సమయం పాటు సూర్యకాంతికి బహిర్గతమవటం వల్ల చర్మంలో ఉండే రక్తనాళాలు వెడల్పుగా మారి, చర్మంపై ఎరుపుదనాన్ని ఏర్పరుస్తాయి. ఇలా జరిగిన తరువాత అదే రోజున చర్మం కందిన లక్షణాలు బహిర్గతమవవు. చర్మం కందిన 24 గంటల తరువాత లక్షణాలు బహిర్గతమవుతాయి. అయితే మూడు నుండి ఐదు రోజుల్లో ఈ స్థితిని మెరుగుపరచవచ్చు.
సూర్యకాంతి వల్ల కందిన చర్మాన్ని ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సరిచేయవచ్చు. దీనివల్ల చర్మ కణాల్లో కలిగిన ప్రమాదాన్ని కూడా తగ్గించువచ్చు.
స్ప్రే బాటిల్లో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని నీటిని కలపాలి. ఈ ద్రావణాన్ని చర్మం కందిన ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. అలాగే శుభ్రమైన కాటన్‌ని వెనిగర్‌లో ముంచి, దీనితో చర్మంపై తుడవవచ్చు. అలాగే డైల్యూటెడ్ ఆపిల్ సైడర్ వెనిగర్‌తో స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల సూర్యకాంతి వల్ల ప్రమాదానికి గురైన చర్మం కొద్ది సమయంలోనే తిరిగి తన సహజ కాంతిని పొందుతుంది. కాబట్టి సూర్యకాంతి వల్ల మారిన చర్మ రంగును తిరిగి తెచ్చుకునేందుకు రసాయన క్రీములకు బదులుగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వాడితే సరిపోతుంది. అలాగే ఎక్కువ సమయంపాటు సూర్యకాంతిలో తిరగకూడదు. స్నానం చేస్తూనే ఎస్‌పిఎఫ్ ఎక్కువగా ఉన్న లోషన్‌లను చర్మానికి రాయాలి.