ఐడియా

చుండ్రుకు చెక్ పెట్టే చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో చుండ్రు బెడద ఎక్కువగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత వంటి కారణాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఎక్కువ సమయం ఏసీలో ఉండటం, రోజంతా ఫ్యాన్ గాలికి కూర్చోవటం, తలస్నానం సమసయ్లో వాడిన షాంపూ పూర్తిగా పోకుండా మాడుకు అంటుకునే ఉండటం, పోషకాహార లోపం, హార్మోన్ల సమస్యల మూలంగానూ ఈ సమస్య రావచ్చు. చుండ్రు సమస్యకు నేరుగా మందులు వాడటం కంటే ఇంట్లోని పదార్థాలతోనే చిన్న చిన్న చిట్కాలద్వారా చుండ్రును తగ్గించుకోవడం మంచిది. అవేంటో ఒకసారి చూద్దాం..
* తలస్నానం చేసినప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి. కండీషనర్ వాడిన తర్వాత తలను శుభ్రపరచడంతో పాటు తలస్నానం తర్వాత షాంపూ అవశేషాలు జుట్టు, మాడు పైనా లేకుండా చూసుకోవాలి.
* తలకు ఎండ, గాలి తగలకుండా కప్పి ఉంచకూడదు. పొడి చర్మం ఉన్నవారు అవసరాన్ని బట్టి తగిన మాయిశ్చరైజర్, షాంపూ, హెర్బల్ కండీషనర్ ఎంపిక చేసుకుని వాడాలి.
* షాంపూతో తలస్నానం చేశాక అర మగ్గు నీళ్లలో మూడు చెంచాల వెనిగర్ కలిపి తలపై పోయాలి. మూడు నెలలపాటు వారానికోసారి ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
* తలస్నానానికి అరగంట ముందు పులిసిన పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే చుండ్రు తగ్గిపోతుంది.
* ఉసిరిలోని ఐరన్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి నిమ్మరసంలో ఉసిరి రసం లేదా ఉసిరి పొడి కలిపి తలకు బాగా పట్టించి మర్దన చేసి ఓ గంట తర్వాత స్నానం చేయాలి.
* గోరువెచ్చటి కొబ్బరినూనెలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంటపాటు మర్దన చేయాలి. తరువాత వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది. వారానికి రెండుసార్లు ఇలా చేయాలి.
* మెంతుల్ని నానబెట్టి రుబ్బి తలకు పట్టించి మర్దనా చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఎంతటి చుండ్రు అయినా వదిలిపోతుంది.
* చుండ్రు బాధితులు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పీచుపదార్థం ఉండేలా చూసుకోవాలి. విటమిన్ - ఎ అధికంగా పండ్లు తీసుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గింజలు, కాయగూరలు, చేపలూ తీసుకోవాలి. వేపుళ్ళకు మాత్రం దూరంగా ఉండాలి.