S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

01/31/2019 - 18:18

థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్య ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ప్రధానమైన సమస్య జుట్టు రాలడం. థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడే సమస్యల వల్ల హార్మోన్లలో ఏర్పడే అసమతుల్యత ఫలితంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేవి కలుగుతాయి. వీటివల్ల కలిగే సమస్యల్లో వెంట్రుకలు రాలడం కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు.

01/30/2019 - 18:21

బ్లూబెర్రీలో చాలారకాల ఔషధ తత్త్వాలు ఉన్నాయి. అంతేకాదు ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇవి సాధారణంగా అమెరికా, యూరప్, కెనడా, ఆసియాలలో పెరుగుతాయి. బ్లూబెర్రీ మొక్కలు పొదల్లా పెరుగుతాయి. ఈ పొదలను అనుసరించి వీటిని మూడు రకాలుగా వర్ణించారు.
* బ్లూబెర్రీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
* మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో బ్లూబెర్రీ ఎంతగానో సహాయపడుతుంది.

01/29/2019 - 18:59

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు సరైన ఆహారం తీసుకోవాలి. దానితో పాటు కొంత వ్యాయామాలు చేస్తే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. అయితే కొంతమంది అధికంగా పనిచేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. నిద్ర కూడా సరిగ్గా పోరు. ఇలాంటివారికి కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకుంటే మంచిది. వ్యాధినిరోధక శక్తి పెంచడంలో విటమిన్ ‘సి’ ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

01/28/2019 - 18:45

ఉదయం నుండి రాత్రి పడుకునేవరకు ఏదో ఒక పనిలో బిజీబిజీగా గడుపుతూనే ఉంటాం. రాత్రి పడుకునే సమయంలో కూడా ఏవో పనులు చేసుకుంటూ, తింటూ, టీవీ చూస్తుంటారు. ఇలా చేయడం అనారోగ్యకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొందరు మహిళలైతే అమాంతం బరువు పెరిగిపోతుంటారు. ఇలా బరువు పెరగడానికి నిద్రించే ముందు మొబైల్, లాప్‌టాప్.. ఇతరత్రా వాడుతుండటమేనని సర్వేల్లో వెల్లడైందట.

01/27/2019 - 22:52

ఎంతో ఖరీదు పెట్టి నగలని ఇష్టంగా కొంటాం. వాటిల్లో ముత్యాలు, విలువైన రాళ్లు, వజ్రాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాల విలువైన నగలు ఉంటాయి. చిన్న నిర్లక్ష్యం జరిగినా మరమ్మతులకి వేలల్లో ఖర్చవుతుంది. అలా కాకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే సరి.

01/24/2019 - 19:23

అవిసె గింజలలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటే శారీరక అలసట తగ్గుతుంది. శక్తి లభిస్తుంది. శరీరం చురుగ్గా ఉంటుంది.

01/23/2019 - 18:47

తమలపాకు, తాంబూలం.. పూజలకు మాత్రమే వాడతారని మనందరికీ తెలుసు. కానీ తమలపాకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో ఒకసారి చూద్దాం..
* కొన్ని తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడినీళ్లతో తీసుకుంటే బోదవ్యాధి తగ్గడానికి దోహదపడుతుంది.

01/23/2019 - 18:44

ఆల్ఫా లినోలిక్ ఆమ్లం అధికంగా ఉన్న గింజలు అక్రోట్లు మాత్రమే! ఇవి స్ర్తీ, పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది. అక్రోట్లలోని మెలటోనిన్ నిద్రపట్టేలా చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధకశక్తినీ, తెలివితేటల్నీ, జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయి. డిప్రెషన్నీ నిరోధిస్తాయి.

01/22/2019 - 18:19

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది. దీనే్న బాలనెరుపు అంటారు. ఈ కారణంగా వారు నలుగురిలోకి చొరవగా వెళ్లి మాట్లాడలేరు. సమస్యకు తక్షణ, సులువైన పరిష్కారంగా డై మొదలుపెడతారు. అయితే దీనివల్ల చర్మ సమస్యల వంటి ప్రతికూల ప్రభావాలతో పాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి.

01/20/2019 - 22:54

మల్లెపూలను కేవలం అలంకరణ నిమిత్తం, మగువలు తలలో పెట్టుకోవడానికి మాత్రమే వాడతారు అనుకోకండి. ఈ పూలలో కూడా కొన్ని ఔషధ గుణాలున్నాయని అంటున్నారు శాస్తజ్ఞ్రులు.
* కళ్లు బాగా అలసటగా ఉన్నప్పుడు.. మల్లెపూల రసంతో కంటి చుట్టు భాగాల్లో మర్దన చేసుకొని పడుకుంటే చల్లగా ఉంటుంది.
* చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టించవచ్చు.

Pages