ఐడియా

థైరాయిడ్ సమస్యా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్య ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ప్రధానమైన సమస్య జుట్టు రాలడం. థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడే సమస్యల వల్ల హార్మోన్లలో ఏర్పడే అసమతుల్యత ఫలితంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేవి కలుగుతాయి. వీటివల్ల కలిగే సమస్యల్లో వెంట్రుకలు రాలడం కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్‌లో ఏర్పడే సమస్యలను తగ్గిస్తే జుట్టు రాలడం కూడా తగ్గిపోతుందట. కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. వ్యాయామాలు చేయడం వల్ల థైరాయిడ్ సంబంధిత వ్యాధిగ్రస్తులకు మేలు కలుగుతుంది. ముఖ్యంగా వ్యాయామాలు జుట్టు రాలటాన్ని దాదాపుగా తగ్గించి వేస్తాయి. జుట్టు రాలడాన్ని ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాని విటమిన్ ‘సి’ కలిగి ఉంటుంది. బెల్ మిరియాలు, పచ్చని ఆకుకూరలు, బెర్రీలు, సిట్రస్ జాతికి చెందిన పండ్లు, పచ్చి బఠాణీలలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. అమైనో ఆసిడ్ సంబంధిత ఎల్-లైసిన్, ఎల్- ఆర్జినైన్ సమ్మేళనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. కోడిగుడ్డు, చేప, లెగ్యూమ్‌ల నుండి అమైనో ఆసిడ్స్‌ను పొందవచ్చు.