ఐడియా

బాలనెరుపు-నివారణ చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది. దీనే్న బాలనెరుపు అంటారు. ఈ కారణంగా వారు నలుగురిలోకి చొరవగా వెళ్లి మాట్లాడలేరు. సమస్యకు తక్షణ, సులువైన పరిష్కారంగా డై మొదలుపెడతారు. అయితే దీనివల్ల చర్మ సమస్యల వంటి ప్రతికూల ప్రభావాలతో పాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. శరీరంలోని మెలనిన్ స్థాయిని జుట్టు రంగులు మారతాయి. వృద్ధుల్లో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి జుట్టు తెల్లబడుతుంది. దీన్ని తిరిగి నల్లగా మార్చటం సాధ్యం కాదు. అయితే బాల్యం, యవ్వనంలో ఈ సమస్య వస్తే దానికి తగు చిట్కావైద్యం, ఆహార నియమాల సాయంతో ఎదుర్కోవచ్చు.
* బాలనెరుపు ఉన్నవారు రోజూ కప్పు ఉసిరికాయ రసం తాగితే జుట్టు కుదుళ్ళు బలపడటమేగాక నెరుపు ఆగుతుంది.
* పది గ్రాముల వెల్లుల్లి పొట్టును బూడిద చేసి వంద మిల్లీ లీటర్ల ఆలివ్ ఆయిల్లో కలిపి పదిరోజులు నిల్వచేసి దాన్ని రోజూ రాత్రి తలకు రాసుకుని ఉదయం తలస్నానం చేస్తే జుట్టు నెరుపు ఆగుతుంది.
* కరివేపాకు, గుంటగలగరాకు, పొన్నగంటి కూరలను కలిపి రుబ్బి తలకు రాసి ఆరిన తర్వాత తలస్నానం చెయ్యాలి. ఈ మిశ్రమాలతో పాటు నేల ఉసిరిని కూడా కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* రెండు కప్పుల నీటిలో గుప్పెడు రాచ ఉసిరికాయలు వేసి ఉడికిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి దానికి సమపాళ్ళలో గోరింటాకు పొడి కలిపి కుదుళ్ళకి పట్టించాలి. ఇలా వారానికి కనీసం మూడు సార్లు చేస్తే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
* ఒక గినె్నలో నాలుగు చెంచాల నిమ్మరసం, కాఫీ పొడి, గుడ్డు సొన, రెండు చెంచాల కొబ్బరినూనె, రెండు చెంచాల వడగట్టిన ఉసిరి రసం కలిపి మూడు గంటలపాటు అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని జుట్టు కుదుళ్ల మొదలు చివరల వరకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
* గోరింటాకు, మందార ఆకు, కరివేపాకులను సమపాళ్ళలో తీసుకుని మెత్తగా రుబ్బి తలకు పట్టించి, ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తుంటే బాల నెరుపు పోయి జుట్టు నల్లబడటమే కాక, జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి.
* గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.
* రోజువారీ ఆహారంలో కరివేపాకును పచ్చడి, పొడి వంట రూపాల్లో విరివిగా వాడాలి.
* పరగడుపున రుబ్బిన పచ్చి కరివేపాకు ముద్ద తీసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.