ఐడియా

నిద్రించే ముందు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నుండి రాత్రి పడుకునేవరకు ఏదో ఒక పనిలో బిజీబిజీగా గడుపుతూనే ఉంటాం. రాత్రి పడుకునే సమయంలో కూడా ఏవో పనులు చేసుకుంటూ, తింటూ, టీవీ చూస్తుంటారు. ఇలా చేయడం అనారోగ్యకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొందరు మహిళలైతే అమాంతం బరువు పెరిగిపోతుంటారు. ఇలా బరువు పెరగడానికి నిద్రించే ముందు మొబైల్, లాప్‌టాప్.. ఇతరత్రా వాడుతుండటమేనని సర్వేల్లో వెల్లడైందట. కృత్రిమ లైట్ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, కృత్రిమలైట్ వాడకం కేలరీలను ఖర్చుచేసే బ్రౌన్‌సెల్స్‌పై ప్రభావం చూపి విపరీతంగా బరువు పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చాటింగ్‌లు చేస్తూ, ఫేస్‌బుక్ చూస్తూ.. ఈ వెలుగులోనే రాత్రి సమయంలో ఎక్కువగా పనిచేస్తుంటారు. అంతేగాకుండా పనిచేసుకుంటూ ఏదో ఒక జంక్‌ఫుడ్ తీసుకుంటుంటారు. ఈ సమయంలో తీసుకునే ఆహారానికి పనిమితులుండవు. కాబట్టి.. నిద్రించే ముందు ఇలాంటివాటికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.