S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

12/28/2018 - 18:56

చలికాలంలో ఎవరికీ నీళ్లు తాగాలనిపించదు. వేడివేడిగా కాఫీనో, టీనో తాగాలనిపిస్తుంది కానీ మంచినీళ్లు తాగరు. కానీ చలికాలంలో కూడా సరైన మోతాదులో మంచినీళ్లు తాగాలి. శరీరానికి తగినంత మంచినీరు అందకపోతే కడుపులో అంతా గందరగోళంగా ఉంటుంది. ఆహారం సరిగా అరగదు. ఈ సమయంలో ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే తెలుస్తుంది.. అది ఆకలి వచ్చిన గందరగోళమో.. లేక శరీరానికి నీళ్లు అందక, డీహైడ్రేషన్ వచ్చిన గందరగోళమో అని.. అంతేకాక..

12/27/2018 - 18:37

చలికాలంలో జుట్టు తడవడం, తల జిడ్డుగా, అట్టకట్టినట్లు కనిపించడం మామూలే.. అలాగని రోజూ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని అప్పుడప్పుడూ జుట్టుకు హెయిర్ ప్యాక్స్ వేస్తూవుండాలి. అప్పుడే జుట్టు అందంగా, ఆరోగ్యంగా, మెత్తగా పట్టుకుచ్చులా కనిపిస్తుంది.

12/26/2018 - 18:43

చాలామంది పిల్లలు లైంగిక వేధింపులపై తల్లిదండ్రుల దగ్గర నోరువిప్పరు. ఒకవేళ చెప్పినా తల్లిదండ్రులు ఎలా స్వీకరిస్తారో, ఏమంటారో తెలియక ఇలాంటి సమస్యల్ని వౌనంగా భరిస్తారు. పక్కంటివారు, దగ్గరి బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులు, తెలిసినవారి నుంయి లైంగిక వేధింపులకు గురవుతున్నారు పిల్లలు. ఈ సమస్య చాలా సున్నితమైనది.

12/25/2018 - 18:29

వైద్యానికి కూడా లొంగని మానసిక కుంగుబాటును దూరం చేసే అద్భుత లక్షణాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయని తేలింది. వీటిలో మెదడును ‘రీసెట్’ చేసే ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తాజా పరిశీలనలు చెబుతున్నాయి. డిప్రెషన్‌ను తగ్గించే గుణం పుట్టగొడుగుల్లో ఉందా? అనే కోణంలో కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.

12/23/2018 - 23:14

అన్ని పండ్లూ ప్రతి కాలంలోనూ దొరకవు. ఒక్కో కాలానికి ఒక్కో పండు ప్రత్యేకం. అలా కమలాపండ్లు చలికాలంలోనే దొరుకుతాయి. వైద్య నిపుణుల ప్రకారం.. ప్రతి ఒక్కరూ సీజనల్ పండ్లను తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలుంటాయి. చలికాలంలో విరివిగా కమలాపండ్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి. చలికాలంలో విరివిగా కమలాపండ్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి.

12/21/2018 - 22:05

శీతాకాలంలో అనారోగ్య సమస్యలు అంటే.. జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..

12/19/2018 - 19:41

మారిన జీవనశైలి వల్ల రాత్రిపూట చాలా ఆలస్యంగా తినడం పరిపాటైపోయింది. పోషకాహార నిపుణులు, వైద్యులు చెప్పేదాని ప్రకారం నిద్రపోయే ముందు రెండు గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు ఆహారం తింటే.. అంటే తిన్న వెంటనే నిద్రపోతే.. అదీ ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు కొవ్వు పదార్థాలు కూడా పెరిగి గుండె సమస్యలు వస్తాయి.

12/18/2018 - 18:13

నులిపురుగుల సమస్య కేవలం పిల్లల్లోనే కాదు.., పెద్దల్లో కూడా కనిపిస్తుంది. పిన్ వార్మ్స్, రౌండ్ వార్మ్స్, హుక్ వార్మ్స్.. ఇలా రకరకాల పురుగులు జీర్ణాశయంలోకి చేరుతూ ఉంటాయి. వీటిని నివారించడానికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ నులిపురుగులకు అల్లోపతి చికిత్స కంటే ఆయుర్వేద చికిత్సలే చక్కగా పనిచేస్తాయి. నులిపురుగులు కడుపులో ఉన్నట్లు తెలుసుకోవాలంటే..

12/12/2018 - 19:36

ప్రకృతి స్ర్తికి ఇచ్చిన గొప్ప వరం అందం.. అందుకే దాన్ని కాపాడుకోవడానికి అమ్మాయిలు చేయని ప్రయత్నమంటూ ఏదీ ఉండదు. పసుపు, చందనం అద్దినా, పార్లర్లకి వెళ్లి ఫేస్ ప్యాక్‌ల మీద ప్యాక్‌లు వేయించుకున్నా అన్నీ అందాన్ని కాపాడుకోవడం కోసమే.. కాకపోతే ఇప్పుడున్న ఈ బిజీలైఫ్‌లో గంటలు, గంటలు పార్లర్లలో గడపాలంటే కుదరని పని. అలాగని అలసిపోయిన మొహంతో పార్టీలకు వెళ్లాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే..

12/11/2018 - 19:01

అందమైన ముఖానికి అందాన్నిచ్చే పెదవులు వాతావరణ మార్పుల వల్ల తరచూ పొడిబారుతుంటాయి. ఈ సమస్యను గుర్తించి ఎప్పటికప్పుడు పెదవుల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గులాబీ రేకుల్లా కోమలంగా ఉండాల్సిన పెదవులు గులాబీ ముళ్ళలా మారి ఇబ్బంది పెడతాయి. పొడి చర్మం ఉన్నవారిలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కోమలమైన, మెరిసే పెదవులు కోరుకునే యువతులు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరి.

Pages