ఐడియా

ఫేషియల్ షీట్‌తో అందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి స్ర్తికి ఇచ్చిన గొప్ప వరం అందం.. అందుకే దాన్ని కాపాడుకోవడానికి అమ్మాయిలు చేయని ప్రయత్నమంటూ ఏదీ ఉండదు. పసుపు, చందనం అద్దినా, పార్లర్లకి వెళ్లి ఫేస్ ప్యాక్‌ల మీద ప్యాక్‌లు వేయించుకున్నా అన్నీ అందాన్ని కాపాడుకోవడం కోసమే.. కాకపోతే ఇప్పుడున్న ఈ బిజీలైఫ్‌లో గంటలు, గంటలు పార్లర్లలో గడపాలంటే కుదరని పని. అలాగని అలసిపోయిన మొహంతో పార్టీలకు వెళ్లాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.. అలాంటివారికోసం మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నవే ఫేస్ షీట్ మాస్క్‌లు. వీటిని అతికించుకుని కొద్దిసేపు ఆగి తీసేస్తే చాలు, పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేకుండా.. ఆ క్రీమూ, ఈ క్రీమూ ముఖానికి పూయాల్సిన అవసరం లేకుండానే, ఇంట్లోనే అందాన్ని సులువుగా రెట్టింపు చేసుకోవచ్చు. కేవలం చాక్లెట్ తిన్నంత ఈజీగా, ముఖం కడుక్కున్నంత సులువుగా ఫేషియల్ చేసుకోవచ్చు ఈ ఫేస్ షీట్ మాస్కులతో..
చాలా పల్చటి ఫైబర్ షీట్‌ను ముఖాకృతిలో కత్తిరించి దానికి సీరమ్, ఫ్లోరల్ సెంట్, విటమిన్లు, న్యూట్రియంట్లతో తయారైన జెల్‌ను జతచేస్తారు. పొడిబారిన చర్మం, జిడ్డు చర్మం, సాధారణ చర్మం.. ఇలా చర్మ తీరును అనుసరించి ఈ మాస్కులు ఉంటాయి. ముఖాన్ని శుభ్రం చేసుకుని చర్మతీరును అనుసరించి ఎంచుకున్న షీట్‌ను ముఖంపై అంటించుకోవాలి. దీన్ని పది నుంచి ఇరవై నిముషాల పాటు ఉంచితే సరిపోతుంది. షీట్‌ను తొలగించిన తర్వాత మళ్లీ తిరిగి ముఖం కడుక్కోవాల్సిన పని లేకుండానే ముఖం ఫ్రెష్ అయిపోతుంది. వెంటనే మేకప్ వేసుకుని పార్టీకికానీ, ఫంక్షన్‌కు కానీ వెళ్లిపోవచ్చు. ఇందులో కీర, అలొవెరా, కివీ, గులాబీ, నిమ్మ, దానిమ్మ, ఆపిల్.. ఇలా సహజంగా దొరికే పూలు, పండ్ల వెరైటీలు.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. అంతేకాదు ఫేషియళ్ల మాదిరిగానే షీట్ మాస్కుల్లో కూడా పెరల్, గోల్డ్, చార్‌కోల్, ప్లాటినం.. వంటి చాలా రకాలు దొరుకుతాయి. ముఖానికే కాదు అలసిపోయిన కళ్లకూ, పగిలిపోయిన పెదవులకూ కూడా ప్రత్యేకమైన అండర్ ఐ ప్యాడ్స్, లిప్ మాస్క్‌లు ఉన్నాయి. ఫేస్ షీట్ మాస్క్‌ల మాదిరిగానే వీటిని ఆయా ప్రాంతాల్లో స్టిక్కర్‌లా అతికించుకుని ఆరిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. అంతే అందమైన ఫేషియల్ ముఖం మీ సొంతం.. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ అతికించేయండి.. ఓ ఫేషియల్ షీట్‌ని!