S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

10/09/2018 - 19:26

తీపి అంటే చాలామందికి చాలా మక్కువ. కానీ దీనివల్ల ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతివ్యక్తీ రోజుకు కేవలం ఆరు స్పూన్ల పంచదారను మాత్రమే వాడాలని చెబుతోంది. ప్రస్తుతం ఏ డాక్టరు అయినా చక్కెరకు దూరంగా ఉండమనే చెబుతున్నాడు. సాధారణంగా చక్కెర, మైదా, అన్నం, ఉప్పులను కలిపి వైట్ డెవిల్స్ అంటారు.

10/08/2018 - 03:37

వర్షాకాలం, చలికాలంలో పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా శరీరాన్ని మోసే పాదాల్లో పగుళ్లు రావడం, అవి నీళ్లలో నాని చివికిపోయి, వాసన రావడం సహజం. మొదట్లో ఇది సమస్యగా అనిపించకపోయినా తరువాత పెనుసమస్యగా మారే అవకాశముంది. చాలా సమయం నీళ్లలో పనిచేయడం వల్ల ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాదాలను సంరక్షించుకోవచ్చు.

10/05/2018 - 19:52

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా దక్షిణాదివారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఆచితూచి తిన్నా సరే.. వారిలో నలభై సంవత్సరాల తర్వాత పొట్ట వచ్చి పడుతుంది. అదే ఉత్తరాదివారిలో అయితే ఈ సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు గోధుమ రొట్టెలను తింటారు. మసాలాలూ తక్కువే. అందుకే వారు బరువు తక్కువ పెరుగుతారు. మనం కూడా మన ఆహార పద్ధతుల్లో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు.

10/04/2018 - 19:20

పెరుగు చక్కని రుచిని, అంతే చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే పెరుగు అద్భుత సౌందర్యాన్ని కూడా ఇస్తుంది. పెరుగుతో కొన్ని వంటింటి వస్తువులను జత చేస్తే శరీరం మెరుపులీనడం ఖాయం మరి..
* అరకప్పు పెరుగులో చెంచా వేప పొడి, అరచెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చులా తయారవుతాయి. అంతేకాదు చుండ్రు సమస్య కూడా అదుపులో ఉంటుంది.

10/03/2018 - 20:01

ఎన్ని క్రీములు వాడుతున్నా చర్మాన్ని సహజంగా మెరిపిస్తేనే అందం. అలాంటి మెరుపు సొంతం కావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి.

09/30/2018 - 23:23

సహజ సౌందర్యం పెరగాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు..
* సాధ్యమైనంతవరకూ హెయిర్ స్టయిలింగ్ చికిత్సలూ, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిలో గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలు తాత్కాలికంగా మెరిపించినా భవిష్యత్తులో జుట్టు ఎదుగుదలను నియంత్రిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని వాడకపోవడమే మంచిది.

09/28/2018 - 19:33

పెదవులు అందంగా కనిపించాలని అందరూ ఆరాటపడతారు. కానీ దంతాలపై అంత దృష్టి పెట్టం. మనం నవ్వినా, మాట్లాడినా దంతాలు తెల్లగా, అందంగా కనిపిస్తే ముఖ సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. అందుకని దంతాలను ఎప్పుడూ తెల్లగా, ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. దంతాలను తెల్లగా, ముత్యాల్లా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు..

09/27/2018 - 19:04

వర్షాకాలంలో ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది.
* వర్షాకాలంలో ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో తులసి ఆకులు, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనె్ఫక్షన్స్ తగ్గుతాయి.
* క్యారెట్, టొమాటో, కొద్దిగా అల్లం ముక్కని కలిపి జ్యూస్ చేయాలి. ఇందులో తేనె, కొద్దిగా నీళ్లు కలుపుకుని తాగాలి. ఇలా వీలైనప్పుడల్లా తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.

09/26/2018 - 19:08

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు అంటే.. జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..

09/25/2018 - 18:51

ఆస్తమా వ్యాధి వచ్చినవారికి ఊపిరితిత్తుల్లో గాలిప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. దీంతో దగ్గు, గురక వంటి సమస్యలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఆస్తమా వ్యాధి నుండి సమర్థవంతంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Pages