S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

08/07/2018 - 19:06

చాలామంది అందమైన ముఖానికి కారణం పలువరుసే అంటారు. వీటిని ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం తోపాటుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే పంటి వలన వచ్చే వ్యాధులనుంచి దూరంగా ఉండవచ్చు. నోటి పరిశుభ్రత లేకపోవుట వలనగానీ, గార శుభ్రం చేయకపోవుటవలన గాని, ఆహార పదార్థములు ఎక్కువగా చిగుళ్ళ మధ్యలో ఇరుక్కోవటం వలన గాని, కొన్ని తరహా సూక్ష్మక్రిముల వలనగాని పంటినొప్పి, పళ్లు పుచ్చడం లాంటివి వస్తాయ. ఒక్కోసారి చిగుళ్లు వాపు వస్తాయ.

08/07/2018 - 19:00

* పని ఒత్తిడి కలిగినప్పుడో లేక,చదువుకుంటూ ఉన్నప్పుడూ టీ తాగాలనిపిస్తే అరగ్లాసు వేడినీళ్లు తాగండి. అటు జీర్ణశక్తి తోపాటు పనిలో ఏకాగ్రత కుదురుతుంది.
* కూరలు చేసేటపుడు ఘాటైన వాసన ఇల్లంతా అలుముకుంటే వెనిగర్‌ను స్ప్రే చేయండి.
* ఈ వర్షాకాలంలో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి కర్పూరం వెలిగించకుండా అక్కడక్కడా పెట్టి ఉంచండి.

08/05/2018 - 21:52

* ఇంట్లో సాంబ్రాణి పొగ అప్పుడప్పుడూ వేసినా మంచి సువాసనతోను, పురుగులు దూరంగాను ఉంటుంది.
* సాంబారు చేసేటపుడు మరీ పలుచగా అయిపోతే ఒక చెంచా బియ్యపుపిండిని కలపండి.
* ఉప్పు ఎక్కువైన కూరల్లో పచ్చిమిరప కలపండి.
* ఉల్లిపాయలు వేపేటపుడు చిటికెడు చక్కెర కలిపితే మంచి బ్రౌన్‌కలర్ వస్తాయి. మంచి రుచి రంగు వస్తుంది.

07/30/2018 - 19:13

ఎవరికైనా నేటి కాలంలో వ్యాయామం తప్పనిసరి. కాకపోతే మోనోపాజ్ కు చేరువ అవుతున్న మహిళలుమాత్రం వ్యాయామానికి మరింత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందే. లేనట్టయితే గుండెజబ్బులు, కండరాలు పట్టుకోవడాలు, మధుమేహం, ఇంకా ఇంకా అనేకానేక జబ్బులు వస్తుంటాయి. అట్లాకాక 30 ఏళ్ల వయస్సులో ఉన్నట్టుగానే ఉండాలి అంటే తప్పనిసరిగా పొద్దునే్న వాకింగ్ కి వెళ్లాలి. కనీసం అర్థగంట మీకోసం మీరు ఏర్పాటు చేసుకోవాలి.

07/27/2018 - 21:21

ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు. నిజమే ఒక్క తోట కూర తింటే చాలు మీకు విటమిన్ ఎ, సి. డి, బి12, బి6 లతో విటమిన్ ఇ, కె కూడా లభిస్తాయి. ఇంతేకాదు సోడియం, పొటాషియం లతో పాటు కాపర్, కాల్షియం, మెంగనీస్, సెలీనియం, ఇనుము, మెగ్నిషియం, పాస్పరస్, జింక్ లాంటి ఖనిజాలు లభిస్తాయి. అందుకే వంద గ్రాముల తోటకూర తిన్నారనుకోండి. మీ శరీరానికి సుమారుగా 716 క్యాలరీలు లభ్యమైనట్లే.

07/25/2018 - 19:49

కొందరిలో జుట్టు చిన్నప్పుడే తెల్లబడి పోతుంటుంది. ఇంకొందరి మరీ చిన్నపిల్లల్లో కూడా తెల్లబడి ఉంటుంది. ఇటువంటివాళ్లు ఉసరిపొడిని దానికి తగ్గ నిమ్మరసాన్ని కలిపి మాడుకు పట్టించి తరువాత తలకు పోసుకొంటే ఈ తెల్లబడే తత్వం నుంచి బయటపడవచ్చు. ఉసిరి రసాన్ని అంతే మోతాదులో కొబ్బరి నూనెను కలిపి బాగా మరగ కాచి ప్రతిరోజు ఆ నూనెను జుట్టుకు రాయడంవల్ల కూడా త్వరగా తెల్లబడదు. పైగా జుట్టు వత్తుగా పెరుగుతుంది.

07/25/2018 - 19:45

బీట్‌రూట్ గడ్డను ఉడికించి గుజ్జు చేయండి. ఆ గుజ్జును ముఖంపైన, మెడ భాగంలోను అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడగండి. ముఖంలో మెరుపులు ఖాయం. ఓట్‌మీల్ 2 స్పూన్స్ తీసుకోండి. అందులో రెండు చుక్కలు బీట్ రూట్ రసం కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆగి కడిగేయండి. అలసట మాయం అయ్యి మంచి ఫ్రెష్‌నెస్ వస్తుంది.

07/20/2018 - 18:58

వర్షాలు పడుతున్నపుడు ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే చిన్న చిన్న పురుగులు వచ్చే అవకాశం ఉంది. వీటివల్ల తినే పదార్థాలల్లోకి చెడిపోవచ్చు. అనేక వ్యాధులు రావడానికి ఈ పురుగులు కారకాలు అవుతాయ. అందుకే వీటిని దూరం చేసుకోవడానికి శుభ్రతను పాటించాలి.

07/18/2018 - 19:44

కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచేవేరు. కరివేపాకును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మంచి వాసన మంచి రుచిని ఇచ్చే కరివేపాకు కేవలం అవేకాక మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వైద్యంలోను కరివేపాకు పాత్ర అమోఘం అంటారు ఆయుర్వేద నిపుణులు. అందుకే కరివేపాకు గురించి కాస్త తెలుసుకుందాం.

07/17/2018 - 19:15

చాలామంది పిల్లలు ఆకలి లేదు అని చెబుతుంటారు. స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఏ చిప్స్ లాంటివైతే తింటారు కాని అన్నం కాని, మరేదైనా చిరుతిండి ని కూడా ఇష్టపడకుండా ఆకలి లేదు అనేస్తుంటారు. ఇలా వీరిని వదిలేయడం వల్ల వారి కడుపులో నులిపురుగులు చేరడం, లేదా జీర్ణశక్తి దెబ్బతినడం లాంటివి జరుగుతుంటాయి.

Pages