ఐడియా
వర్షాకాలంలో అల్లం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వర్షాకాలంలో ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది.
* వర్షాకాలంలో ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో తులసి ఆకులు, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనె్ఫక్షన్స్ తగ్గుతాయి.
* క్యారెట్, టొమాటో, కొద్దిగా అల్లం ముక్కని కలిపి జ్యూస్ చేయాలి. ఇందులో తేనె, కొద్దిగా నీళ్లు కలుపుకుని తాగాలి. ఇలా వీలైనప్పుడల్లా తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
* గచ్చకాయ మసి, పటిక, పోకచెక్క మసి, అల్లం మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపు, చీము, రక్తం కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* గ్లాసు నీళ్లలో పావు టీ స్పూను ఏలకల పొడి, కొద్దిగా అల్లం వేసుకుని తాగితే యూరిన్ ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
* అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
* ప్రతిరోజూ ఉదయం గ్లాసులో కొద్దిగా అల్లం రసం కలుపుకుని తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది.