ఐడియా

కోమలమైన పాదాల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలం, చలికాలంలో పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా శరీరాన్ని మోసే పాదాల్లో పగుళ్లు రావడం, అవి నీళ్లలో నాని చివికిపోయి, వాసన రావడం సహజం. మొదట్లో ఇది సమస్యగా అనిపించకపోయినా తరువాత పెనుసమస్యగా మారే అవకాశముంది. చాలా సమయం నీళ్లలో పనిచేయడం వల్ల ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాదాలను సంరక్షించుకోవచ్చు. ఇంట్లోని వస్తువుల ద్వారానే పగుళ్ళ నివారణకు, సంరక్షణకు ఉపాయాలు చూద్దాం..
* రాత్రి పడుకునేముందు పాదాలను మురికి లేకుండా బాగా కడిగి తుడుచుకోవాలి. తరువాత ఆముదంలో కొద్దిగా పసుపును వేసి పేస్ట్ అయ్యేలా బాగా కలిపి దీన్ని పాదాల పగుళ్లకు రాసుకుని పడుకోవాలి. పొద్దునే్న నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.
* వేపాకు యాంటీబయాటిక్. దీనిలో పాదాల పగుళ్ళ నుంచి రక్షణ కలిగించే యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే గుప్పెడు వేపాకుకు స్పూన్ పసుపును కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి అరగంట తరువాత నెమ్మదిగా రుద్దుతూ పాదాలను శుభ్రంగా కడిగేసి, తడి లేకుండా తుడవాలి. తరువాత నూనెతో మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తే పగుళ్ళు మాయమై పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* పడుకునేముందు పాదాలను శుభ్రంగా కడిగి, ఫ్యూమిక్‌స్టోన్ రుద్ది మృతకణాలను తొలగించుకోవాలి. తరువాత ఏదో ఒక మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకుని పడుకోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే పాదాలు కోమలంగా కాంతులీనుతాయి.
* బియ్యం పిండిలో కాస్తంత తేనె, యాపిల్ సిడార్ వెనిగర్‌ను చేర్చి పేస్ట్‌లా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటిలో పది నిముషాలు పాదాలను నాననిచ్చిన అనంతరం ఈ పేస్ట్‌తో పాదాలను బాగా రుద్ది శుభ్రంగా కడగాలి. తరువాత పాదాలను తడి లేకుండా తుడుచుకుని ఆలివ్ ఆయిల్‌ను పట్టించాలి. కాసేపటి తరువాత సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తే పగుళ్ళు కనిపించమన్నా కనిపించవు.
* వంటల్లో ఉపయోగించే ఏ నూనెతోనైనా పగుళ్ళకు చెక్ పెట్టేయవచ్చు. ముందుగా పాదాలను గోరువెచ్చటి నీటిలో పదిహేను నిముషాలు నానబెట్టాలి. తరువాత ఫ్యూమిక్‌స్టోన్‌తో రుద్ది మృతచర్మాన్ని, మురికినంతా పోగొట్టాలి. తర్వాత మంచి నీళ్ళతో కాళ్ళను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి ఇంట్లో ఉపయోగించే ఏదో ఒక వంటనూనెను పట్టించాలి. తరువాత సాక్స్ వేసేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి.
* రోజ్‌వాటర్‌లో ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్‌లు చర్మానికి పోషణని అందిస్తాయి. గ్లిజరిన్ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తుంది. రోజ్‌వాటర్, గ్లిజరిన్‌ను సమాననిష్పత్తిలో తీసుకుని బాగా కలిపి నిద్రపోయేముందు పాదాలకు పూయాలి. ఉదయానే్న గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే పాదాల పగుళ్ళు తగ్గుతాయి.
* పారాఫిన్ వ్యాక్స్‌కు ఆవనూనె లేదా కొబ్బరినూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి వ్యాక్స్ పూర్తిగా కరిగిన తరువాత స్టవ్‌పై నుండి దించి చల్లార్చాలి. దీన్ని పడుకోవడానికి ముందు పాదాలకు పట్టించి ఉదయానే్న కడిగేసుకోవాలి. దీంతో పాదాలు పగుళ్ళు లేకుండా మృదువుగా మారతాయి. *