ఐడియా

వర్షాకాలంలో ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు అంటే.. జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..
* ఈ కాలంలో ఆపిల్, దానిమ్మ, అరటిపండ్లను ఎక్కువగా తినాలి. వీటిని ఆరగించడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు.
* వర్షాకాలంలో వీలైనంతవరకు పచ్చి కూరగాయల బదులు మరిగించిన సలాడ్‌ను తీసుకోవడం మంచిది.
* అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారుచేసిన హెర్బల్ టీలు శరీరానికి చాలా మంచివి. ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
* ఈ కాలంలో మొక్కజొన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారం తీసుకోవడం చాలామంచిది.
* బ్రౌన్‌రైస్, ఓట్స్, బార్లీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఈ కాలంలో వేడి వేడి సూపులను తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు వంటివి రాకుండా వుంటాయ.
* వానాకాలంలో వేడివేడి పకోడీలు, సమోసాల వంటి ఆహారం పైకి మనసు పోతుంది.
* వెల్లుల్లిని సూప్‌లలో, కూరల్లో విధిగా వేయాలి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
* కాకరకాయ, పసుపు, మెంతులను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇవి సూక్ష్మజీవుల నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.
* వర్షాకాలంలో వేడి వేడి బజ్జీలు, సమోసాలు, పకోడీలపైకి మనసు మళ్లుతుంది. ఇలాంటివి ఒకసారి తింటే పర్లేదు. కానీ అదేపనిగా వీటిని తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంట్లో చేసినవి తీసుకుంటే మరీ మంచిది.
* ఈకాలంలో చాలామంది జంక్ ఫుడ్ అంటే పిజ్జాలు, బర్గర్లను కూడా ఎక్కువగా తీసుకుంటారు. అలాంటివాటికి దూరంగా ఉండటం మంచిది.
* వర్షాకాలంలో ఆహారంలో పెరుగుకంటే ఎక్కువగా పాలను తీసుకోవాలి.
* బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఏ కాలాల్లో అయినా తీసుకోవచ్చు.
* వర్షాకాలంలో జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది కాబట్టి త్వరగా, తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. చలాకీగా ఉండగలుగుతారు.
* పల్లీ నూనె, ఆముదం, నువ్వుల నూనెలకు బదులుగా తేలిగ్గా ఉండే మొక్కజొన్న నూనెను వంటల్లో చేర్చుకోవడం వల్ల శరీరం తేలిగ్గా ఉంటుంది.