S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

12/07/2018 - 23:11

కాటుక కళ్లు పలికే భావాలు ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతాయి. ఎంత చిన్న కళ్లు అయినా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. మంగళ ద్రవ్యమైన కాటుక ధారణ సుమంగళత్వాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. కాటుక కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదమూ చెబుతోంది.

12/06/2018 - 19:55

ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో చుండ్రు బెడద ఎక్కువగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత వంటి కారణాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఎక్కువ సమయం ఏసీలో ఉండటం, రోజంతా ఫ్యాన్ గాలికి కూర్చోవటం, తలస్నానం సమయంలో వాడిన షాంపూ పూర్తిగా పోకుండా మాడుకు అంటుకునే ఉండటం, పోషకాహార లోపం, హార్మోన్ల సమస్యల మూలంగానూ ఈ సమస్య రావచ్చు.

12/04/2018 - 19:19

పిల్లల్లో సగం మంది శరీరానికి అవసరమైనంత నీటిని తాగలేకపోతున్నారని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా నీళ్లు తాగని పిల్లల్లో మెదడు పనితీరూ.. మెదడు ఇతర అవయవాలతో సమన్వయం చేసుకునే తీరూ చురుగ్గా ఉండవని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం అందిస్తోంది ఇంటరాక్టివ్ వాటర్ బాటిల్. చూడచక్కని రంగుల్లో చూడగానే పిల్లల్ని ఆకట్టుకునే ఈ నీళ్ల సీసాలకు పైన ఒక తెర ఉంటుంది.

11/29/2018 - 19:32

చలికాలంలో నీళ్లలో ఎక్కువగా పనిచేసే వారిలో పాదాలు, అరిచేతులు పాచినట్లు అవ్వడం, పగుళ్లు సర్వసాధారణమే.. ఆ ప్రాంతంలో చర్మం విడిపోయినట్లుగా, పగిలిపోయినట్లుగా అవుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే ఆ పగుళ్ల నుంచి రక్తం, చీముకారడం, దురద వంటి సమస్యలు కూడా తప్పవు. చెప్పులు లేకుండా నడిచినా, డిటర్జెంట్ సబ్బులు, వంటసోడా ఎక్కువగా చర్మానికి తగిలినా కూడా ఈ సమస్యలు ఎదురవుతాయి.. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే..

11/28/2018 - 19:51

నోటి దుర్వాసన పెద్ద సమస్య. శరీరంలో వివిధ రుగ్మతల వల్లనో, అనారోగ్యకరమైన అలవాట్ల వల్లనో నోటి దుర్వాసన తలెత్తుతుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించాలి. అలాగే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినా నోటి దుర్వాసన నుంచి టెంపరరీగా రిలీఫ్ కలుగుతుంది. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

11/23/2018 - 18:43

రోజువారీ ఆహారంలో తగినన్ని ఖనిజాలు ఉన్నాయా? లేవా? అని చూసుకుంటాం కానీ మెగ్నీషియం గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. శరీరం సక్రమంగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. కండరాలు, నరాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే మెగ్నీషియం తప్పనిసరి. రోగనిరోధక వ్యవస్థకు సాయపడుతుంది. ఆరోగ్యకరమైన గుండెను అలాగే కాపాడుకోవడానికి, ఎముకలను దృఢంగా ఉంచుకోవడానికి కూడా మెగ్నీషియం ఎంతగానో ఉపయోగపడుతుంది.

11/21/2018 - 19:40

దంతాలను తెల్లగా, ముత్యాల్లా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు..

* చిన్న చెంచాతో ఉప్పు తీసుకుని అందులో రెండు, మూడు చుక్కల నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమంతో దంతాలను తోమడం వల్ల దంతాలు శుభ్రపడతాయి, మెరిసిపోతాయి. ఈ మిశ్రమం కూడా చిగుళ్ళకు అంటకుండా చూసుకోవాలి.

11/18/2018 - 23:05

పలు రకాల విటమిన్లు, ఖనిజాలు, బలాన్ని పెంచే ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభించే గుడ్లను రోజూ రెండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి పోషకాలు లేని పిజ్జాలు, బర్గర్లను తినిపించి పిల్లలను ఊబకాయులుగా మార్చే బదులు వారికి గుడ్లు ఇవ్వడం ఉత్తమం. యాపిల్స్‌లో కంటే రెండింతలు యాంటీ ఆక్సిడెంట్లు గుడ్డులో లభిస్తాయి.

11/16/2018 - 19:12

నేడు ప్రపంచ మానవాళిని ఎక్కువగా భయపెడుతున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటన్నది అందరికీ తెలిసిందే. భారత్‌లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలను, వైద్య చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

11/15/2018 - 19:06

ఏడాది పొడవునా లభించే పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేద వైద్యంలో పుదీనా మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలర్జీ, ఉబ్బసానికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. వంటల్లోనే కాదు, ‘టీ’లో కూడా పుదీనా ఆకులను విరివిగా వాడుతుంటారు. పుదీనా ఆకులతో చేసే పచ్చడి రుచికరంగానే కాదు, ఆరోగ్యరీత్యా మనకు మేలు చేస్తుంది. పుదీనాను ఆహార పదార్థాలలో వాడడం వల్ల శ్వాస సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Pages