ఐడియా

చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ మానవాళిని ఎక్కువగా భయపెడుతున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటన్నది అందరికీ తెలిసిందే. భారత్‌లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలను, వైద్య చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

* ప్రతిరోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలను నిర్ణీత సమయానికి విధిగా తీసుకోవాలి. కాఫీ, టీలకు బదులు పల్చటి మజ్జిగ, గ్రీన్ టీ సేవించడం ఉత్తమం. చక్కెర స్థాయిని తగ్గించే ఔషధ గుణాలు గ్రీన్ టీలో విరివిగా ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది.

* మధుమేహంతో బాధపడేవారు రోజూ ఉదయం పూట కాసేపు నడవాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. చిన్న చిన్న ఎక్సర్‌సైజులు ఇంట్లోనే చేస్తుండాలి.

* దాల్చినచెక్కను నీళ్లలో వేసి మరగించి, చల్లారాక ఆ నీటిని రెండు పూటలా తాగితే ఫలితం ఉంటుంది.

* ఉదయానే్న పరగడుపున మరగించిన కాకరకాయ రసాన్ని చల్లార్చి తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

* పెసలు, బఠానీలు, కొమ్ము శనగలు వంటివి రాత్రి పూట నీళ్లలో నానపెట్టి, మర్నాడు ఉదయం ఆ మొలకలను తినాలి
.
* లేత తులసి ఆకులను పిండి, ఆ రసాన్ని నీళ్లలో కలుపుకొని తాగుతుండాలి.

* నేరేడు పండ్లు తినడం వల్ల మధుమేహరోగులకు ఉపశమనం లభిస్తుంది.

* ఉదయానే్న ఏమీ తినకముందు నాలుగైదు వెల్లుల్లి ముక్కలను తినడం మంచిది.

* కరివేపాకు, బీట్‌రూట్, మెంతులను ఆహార పదార్థాల్లో విరివిగా వాడుతుండాలి.