S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఐడియా
మొలకెత్తిన గింజల్లో బఠానీలు మరింత మంచి బలవర్థకాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. వీటిల్లో 14.5 కార్బోహైడ్రేట్స్, 5.7 పీచు పదార్థాలు, 5.4 ప్రోటీన్స్, ఉంటాయి. అంతేకాదు 1.5.మి.గ్రా ఐరన్, 1.2 మి.గ్రా.జింక్ విటమిన్ సి 40 మి.గ్రా. ఉన్నాయి. వీటి అన్నింటి వల్ల శరీరానికి మంచి పోషక శక్తి లభిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకొన్నవారు కూడా ఈ బఠానీలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
బరువు తగ్గడానికి చాలామంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. తిండిమానేయడం, అర్ధరాత్రి వరకు నిద్రమానేయడం, ఒక్కరోజులోనే సన్నగైపోవాలని విపరీతమైన వర్కవుట్స్ చేయడం.. వంటి పనులన్నీ చేస్తుంటారు. ఇవన్నీ బరువు పెరగడానికి కారణాలు అవుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య కూడా బరువును పెంచుతుంది తెలుసా! నిద్రలేమి సమస్య వల్ల ఆకలిని నియంత్రించే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది.
వ్యాయామం చేసేటపుడు చికాకుగా అనిపించి జుట్టును గట్టి ముడివేస్తుంటాం కదా. కానీ ఇలా గట్టిముడి వేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతాయి. పైగా చెమట పట్టడం వల్ల జుట్టు ఊడిపోవడం లేదా ఎండుగడ్డిలాగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాకాకుండా ఉండాలంటే జుట్టుకు వ్యాయామానికి ముందు కండీషనర్ రాయాలి. ఆ తరువాత ముడి కూడా జారుగా ఉండే ముడే వేసుకోవాలి.
శ్రావణంలో మంగళ , శుక్ర, శని, సోమ ఇలా అన్ని వారాలు ముఖ్యమైనవే. ముతె్తైదువులకు తాంబూలాలు అంటూ ఇస్తుంటారు. వీటిల్లో నానబెట్టిన శనగలు తప్పనిసరిగా ఇస్తారు. వీటిని పచ్చివే కాక వంటకాల్లోను ఉపయోగించి రుచికరమైన వంటలు తయారు చేస్తుంటారు. నానబెట్టిన శనగలు ప్రతిరోజు తీసుకొంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మొలకెత్తిన గింజలు ఒక్క శనగలే కాదు ఏ తృణధాన్యమైనా ఆరోగ్యానికి మంచిదే.
ఈమధ్యకాలంలో చాలామందిలో ఎసిడిటి కనిపిస్తుంది. ఆహారం తిన్నవెంటనే కడుపులో, ఛాతీలో మంట అంటుంటారు. అసలీ మంట ఎందుకు వస్తుందంటే ఆహారం జీర్ణం కావడానికి విడుదలయ్యే ఆమ్లాలు, రసాలూ జీర్ణాశయంలో అవసరానికి మించి విడుదల అవుతుంటాయి. దీనితో తిన్న ఆహారం ఆ అమ్లాలు కలసి పైకి ఎగతన్ని గుండెలో మంట వేధిస్తుంది. ఇంకొందరికి నోట్లో పుల్లని నీళ్లు వస్తుంటాయి. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది.
* ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. మిఠాయిలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌పాస్ట్ ‘పళ్లు’ తినడంతో ప్రారంభించాలి. మజ్జిగ అన్నం మంచిది (ఉప్పు తక్కువ) లేదా పెరుగు అన్నంలో అల్లం ముక్కలు... కరివేపాకు కలుపుకొని తినాలి.
* మధ్యాహ్నం డైట్‌లో గింజలు, పప్పులు, విత్తనాలు, కొవ్వు తక్కువ వుండే నూనెలుతో ఆహారం తినాలి. తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు చేప, గుడ్లు, మాంసం...
* ఎముకల బలానికి, దగ్గు, ఆయాసం తగ్గడానికి గోంగూర దివ్యౌషధం
* ప్రతిరోజు రెండు రెమ్మల కరివేపాకును పరగడుపున తింటే కంటి చూపు మెరుగు అవుతుంది. బానపొట్ట తగ్గుతుంది.
* జలుబు, దగ్గు, ఆయాసం శరీరంలో వేడి వీటి అన్నింటినీ ధనియాల కషాయం దూరం చేస్తుంది.
* చర్మం నిగారింపు కోసం మెంతికూరను ఆహారంలో రోజు తీసుకోండి.
* శరీరంలోని కొలెస్ట్రాల్‌ను బార్లీ గింజలు తగ్గిస్తాయి.
1. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకొంటే ఇన్సులిన్ వృద్ధి అవుతుంది.
2. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ను దరికి రానివ్వదు.
3. బీట్‌రూట్ రసం బి.పీని నియంత్రిస్తుంది.
4. క్యారెట్ జ్ఞాపక శక్తిని ఇస్తుంది. వూబకాయం నుంచి రక్షిస్తుంది.
5. మొక్కజొన్న మలబద్దక నివారణి.
6. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. బాన పొట్టను కరిగిస్తుంది.
7. అల్లం ఎక్కిళ్లను దూరం చేస్తాయ.
ప్రతిరోజు పండ్ల తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగాలు వచ్చాక వాటిని తగ్గించుకోవడం కాక అసలు రోగాలే రాకుండా చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా. అందుకే ప్రతిరోజు ఆహారంతో పాటుగా పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేరేడు పండ్లు తింటే బొజ్జలో వెంట్రుక ఉంటే కరిగిపోతుంది.
నేరేడులోని గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
ఎదుటివారిని ఆకర్షించేది మనిషి ముఖమే అయినా అందులోకూడా పెదాలు మొట్ట మొదట కనిపిస్తాయి.మాట వల్లే స్నేహం ఏర్పడుతుంది. మాటను వెలువరించేది నోరే కనుక ఆ నోటికి తలుపుల్లాంటివి పెదవులు. వీటిని కొందరు అతిగా పట్టించుకుంటే మరికొందరు నిర్లక్షం చేస్తుంటారు.
ఇందులో ఏది చేసినా ముప్పేర్పడుతుంది.
ఆ ముప్పు తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.