ఐడియా

నోటి దుర్వాసన పోవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటి దుర్వాసన పెద్ద సమస్య. శరీరంలో వివిధ రుగ్మతల వల్లనో, అనారోగ్యకరమైన అలవాట్ల వల్లనో నోటి దుర్వాసన తలెత్తుతుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించాలి. అలాగే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినా నోటి దుర్వాసన నుంచి టెంపరరీగా రిలీఫ్ కలుగుతుంది. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
* ఉదయానే్న పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగ్ క్లీనర్‌తో శుభ్రపరుచుకోవాలి. తినేటప్పుడు వివిధ ఆహారపదార్థాలు, రసాలు నాలుకపై ఉండిపోతాయి. రాత్రుల్లో నాలుకపై ఉన్న ఆహారపదార్థాలు ఇన్‌ఫెక్ట్ అయి నోరు దుర్వాసన మొదలవుతుంది. ఇంతేకాక కడుపులో లో ఎబైల్ రాత్రిపూట అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి నాలుకపై పేరుకుపోతుంది. అందుకే నాలుక శుభ్రపరచడం తప్పనిసరి.
* ఆపిల్, క్యారెట్‌లను రోజూ తినడం వల్ల పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలినాలు శుభ్రమై తాజాగా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది. సాఫ్ట్‌గా, క్రీములా ఉన్న ఆహారపదార్థాలు పళ్ళపై, నాలుకపై అంటుకుని బాక్టీరియాని పెంచి దుర్వాసనకు దారితీస్తుంది. ఆహారాలపై ఈ మెలకువలు పాటించాల్సిందే..
* నోటి దుర్వాసనకు కాఫీ కూడా ఒక మూలకారణం అనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ మధ్య జరిగిన రీసెర్చ్ ప్రకారం, గ్రీన్ టీ ఓవర్ ఆల్ ఆరోగ్యానే్న కాదు, శ్వాసను కూడా గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది. అందుకే కాఫీ రొటీన్‌లను వీలైతే గ్రీన్ టీ అలవాట్లుగా మార్చుకోవాలి.
* కొబ్బరి నూనె ప్రయోజనాలు ఎన్నో అందరికీ తెలిసిందే. అయితే కొబ్బరినూనెలో శ్వాసను మెరుగుపరిచే లక్షణాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. కొద్దిపాటి కొబ్బరినూనెను నోట్లోకి తీసుకుని నాలుగైదుసార్లు పుక్కిలించడం వల్ల నోట్లోని హానికార బాక్టీరియా చనిపోతుంది. పళ్ల చిగుర్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిట్కాలతో శ్వాసని తాజాగా చేసుకుంటే సరి.