ఐడియా
నిమ్మతో మృదువుగా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎన్ని క్రీములు వాడుతున్నా చర్మాన్ని సహజంగా మెరిపిస్తేనే అందం. అలాంటి మెరుపు సొంతం కావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి.
* చల్లని టీ డికాక్షన్, రెండు చెంచాల బియ్యప్పిండి, అరచెంచా తేనెను తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇరవై నిముషాల తరువాత చల్లనీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోవడమే కాదు, తేనె వల్ల చర్మానికి అవసరమైన తేమ కూడా అందుతుంది. ముఖం తాజాగా ఉంటుంది.
* రెండు చెంచాల పాలపొడిని కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ పూతతో చర్మం శుభ్రపడుతుంది. అందంగానూ మారుతుంది.
* రెండు చెంచాల శనగపిండిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత ముఖాన్ని నెమ్మదిగా రుద్దుతూ కడిగేయాలి. ఈ పూతను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం కాంతులీనుతుంది.