ఐడియా

మల్లెపూలు..ఔషధ గుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లెపూలను కేవలం అలంకరణ నిమిత్తం, మగువలు తలలో పెట్టుకోవడానికి మాత్రమే వాడతారు అనుకోకండి. ఈ పూలలో కూడా కొన్ని ఔషధ గుణాలున్నాయని అంటున్నారు శాస్తజ్ఞ్రులు.
* కళ్లు బాగా అలసటగా ఉన్నప్పుడు.. మల్లెపూల రసంతో కంటి చుట్టు భాగాల్లో మర్దన చేసుకొని పడుకుంటే చల్లగా ఉంటుంది.
* చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టించవచ్చు.
* చర్మానికి అవసరమయ్యే ‘సి’ విటమిన్ మల్లెపూలలో పుష్కలంగా ఉంటుంది.
* మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి.. ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
* కొబ్బరినూనెతో కలిపి మల్లెపూల రసాన్ని తలకు రాసుకుంటే మంచి సువాసన వస్తుంది.
* సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాల్లో కూడా నేడు మల్లెపూలను వాడుతున్నారు.
* మల్లెపూలతో తయారుచేసే పలు ఔషధాలు కణితులను కూడా నివారిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
* అరోమా థెరపీలో కూడా మల్లె పూలను వాడుతున్నారు.
* మొటిమల వల్ల వచ్చే మచ్చలకు మల్లెల నూనె రాస్తే ఫలితం ఉంటుంది.
* మల్లెల సువాసన నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.