ఐడియా

వలయాలు పోవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటి చుట్టూ చాలామందికి నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు తెలుసుకుంటే తగ్గించుకోవడం సులువవుతుంది. ఈ సమస్య ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తుంది. అలాగే ఆలస్యంగా పడుకోవడం, కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి, అలర్జీలు, కళ్లు నలిపినప్పుడు ఇలాంటి వలయాలు రావచ్చు. వీటితో పాటు సైనస్, ఎటోపిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా, రక్తహీనత, ఆస్తమా, డీహైడ్రేషన్.. ఇలా చాలానే కారణాలున్నాయి. ఈ సమస్యను తగ్గించడానికి ప్రతిరోజూ ఏదో ఒక నూనెతో కళ్ల చుట్టూ మర్దన చేసుకోవాలి.
వంటింటి పదార్థాలను ఉపయోగించి చిన్న చిన్న చిట్కాల ద్వారా వలయాలను తగ్గించుకోవడం సాధ్యమే..
* బంగాళాదుంప గుజ్జులో చెంచా నిమ్మరసం, రోజ్‌వాటర్‌ను కలిపి కళ్ల కింద పూతలా వేయాలి. కాసేపు మర్దన చేసి తరువాత కడిగేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుండాలి. నెమ్మదిగా వలయాలు తగ్గుముఖం పడతాయి.
* కీరదోస, బంగాళాదుంప ముక్కలను చక్రాల్లా తరిగి కళ్లపై పెట్టుకుంటూ ఉన్నా నలుపుదనం తగ్గిపోతుంది. కళ్లు తాజాగా ఉంటాయి.
* గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్‌లో ఉంచి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేస్తుంటే కళ్లు తాజాగా ఉండటమే కాదు.. చుట్టూ ఉన్న వలయాలు కూడా తగ్గిపోతాయి.
* పచ్చి కొబ్బరిని గుజ్జులా చేసి అందులో కీరా గుజ్జు, నిమ్మరసం కలిపి కళ్ల అడుగున రాసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీటితో కడిగేసుకుంటే కళ్ల చుట్టూ ఉన్న నలుపుదనం పోతుంది.
* పుదీనా గుజ్జు ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా, కొబ్బరినూనె ఒక చెంచా తీసుకుని బాగా కలిపి కళ్ల చుట్టూ పూతలా వేయాలి. పదిహేను నిముషాల తర్వాత కడిగేస్తే కళ్ల చుట్టూ ఉన్న నలుపు తగ్గిపోతుంది.
* డార్క్ చాక్లెట్లు, వాల్‌నట్స్, చేపలు.. వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు రక్తప్రసరణను పెంచి నల్లటి వలయాలను తగ్గిస్తాయి.
* రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి.
* కంప్యూటర్‌పై పనిచేసేవారు ప్రతి గంటకోసారి కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలి.