ఐడియా

గారెలు కరకరలాడాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గారెలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చలి వాతావరణంలో అయితే వీటిని ప్రత్యేకంగా తయారుచేసుకుని తింటారు. వీటిని తింటున్నప్పుడు కరకరలాడితే.. ఎంతో మజాగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో గారెలు కరకరలాడవు. ఇలాంటి సమయంలో కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించినట్లయితే గారెలు కరకరలాడతాయి. అవేంటో చూద్దామా..
* గారెలు కరకరలాడాలంటే గారెల పిండిలో కొద్దిగా సేమ్యాను కలుపుకోవాలి.
* మినపప్పు ఒక గంటలో నానాలంటే గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి.
* పిండి పలుచగా ఉండి గారెలు చేయడం కుదరకపోతే.. అప్పుడు ఆ పిండికి తగినంత బంగాళాదుంపలను తురిమి అందులో కలపాలి. ఇలా చేస్తే వడలు కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.
* పప్పు మాడినట్లుగా వాసన వస్తే దాన్ని వేరే గినె్నలోకి మార్చి రెండు తమలపాకులను వేయాలి. అనంతరం మీడియం మంటపై ఉడకబెడితే మాడు వాసన పోతుంది.
* పాలను మరిగించేటప్పుడు మీగడ ఎక్కువగా, మందంగా కట్టాలంటే.. పాలు కాచే గినె్పపై, జల్లెడలాగా చిల్లులు ఉన్న మూతను ఉంచాలి.