ఐడియా

ఎసిడిటీ తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజీర్తి, ఎసిడిటీ, కడుపునొప్పితో బాధపడేవారు చాలామంది ఉంటారు. ఎసిడిటీ కారణంగా గుండెలో మంట కూడా వస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవి మనం తీసుకునే ఆహారం, సమయంపై ఆధారపడి ఉంటాయి. వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది. ఒకవేళ మీరు ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను పాటించాలి. వెంటనే ఉపశమనం పొందవచ్చు.
* అల్లం అజీర్ణ సమస్యకు చక్కటి మందు. ఒక గ్లాసు నీళ్లలో తురిమిన అల్లం ముక్కలు వేసి బాగా వేడిచేయాలి. ఆ తర్వాత వడపోసి నీటిని చల్లారక ముందే తాగేయాలి. అప్పుడు ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
* అల్లం ముక్కలను దంచి ఆ రసాన్ని సేకరించి కొద్దిగా నీళ్లు కలుపుకుని తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.
* ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి తాగితే కూడా తక్షణ ఉపశమనం పొందవచ్చు. నీటికి బదులుగా తేనె, నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు.
* ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగితే అజీర్ణ సమస్య దూరమవుతుంది.
* ఒక గ్లాసు నీటిలో కొన్ని సోంపు గింజలను వేసి బాగా మరగించాలి. ఆ నీటిని వేడిగా తాగితే మంచిది.
* ద్రవరూపంలో కాకుండా ఘన రూపంలో తీసుకోవాలంటే గుప్పెడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నమిలి తినాలి. వెంటనే ఒక గ్లాసు నీరు తాగాలి. దీంతో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.