ఐడియా

ఎలాంటి తేనె మంచిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లెలు, తండాలు, అడవిలో ఉండేవారి నుంచే ఒకప్పుడు తేనె లభించేది. ఇప్పుడు ప్రతిచోటా తేనె లభిస్తుంది. తేనె ఇప్పుడు మార్కెట్‌లో సులువుగా దొరికే వస్తువుగా మారిపోయింది. అందులో కూడా చాలా బ్రాండ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా లభించే తేనె మంచిదేనా? వాటివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఎలాంటి తేనె కొంటే మంచిదో.. ఒకసారి తెలుసుకుందాం..
నిజానికి ఆయా కంపెనీలు అమ్ముతున్న తేనెలన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసినవిగానే ఉంటాయి. ఇలా అధికంగా ప్రాసెస్ చేస్తే ఆ తేనె వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. ఇలాంటి ప్రాసెసింగ్ తేనెపై పరిశోధకులు చెబుతున్నదేమిటంటే.. మార్కెట్లో దొరికే తేనె కంటే.. పట్టు నుంచి తీసిన తేనెను కొనుక్కోవడమే మంచిదంటున్నారు నిపుణులు. తేనెపట్టు నుంచి తీసిన తేనెలో మాత్రమే నిజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. అయితే మార్కెట్లో కంపెనీలు అమ్ముతున్న తేనె బాటిళ్లపై ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఎందుకంటే అది నిజమైన తేనె కాదు కాబట్టి. ప్రాసెస్ చేయడం వల్ల అది సహజ లక్షణాలను కోల్పోతుంది. అందువల్ల అది త్వరగా పాడవుతుంది. స్వచ్ఛమైన తేనె బాగా ముదురు రంగులో ఉంటుంది. ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి ఈసారి మీరు కొనుక్కునే తేనె పట్టు నుంచి తీసింది తీసుకుంటే చాలా మంచిది.