ఐడియా

ఒవెన్ శుభ్రం చేస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒవెన్ శుభ్రం చేయాలంటే ముందు ఒవెన్‌ను ఆన్‌చేసి 65 డిగ్రీల వేడి వచ్చిన తరువాత ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక కప్పులో సగం వరకు అమ్మోనియా పోసి ఒవెన్‌లో ఉంచాలి. తరువాత ఒక పెద్ద గినె్నలో వేడినీళ్లను కూడా పెట్టి ఒవెన్‌ను మూసేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానే్న అమ్మోనియా కప్పు, వేడినీటి గినె్నలను కూడా బయటకు తీసి కొద్దిసేపు ఒవెన్‌ను ఓపెన్ చేసి ఉంచాలి. ఒక లీటరు వేడినీటిలో పాత్రలు శుభ్రం చేసే లిక్విడ్ కొంచెం, ఒక చెంచా అమ్మోనియా కలిపిన మిశ్రమంలో గుడ్డను ముంచి ఒవెన్ అంతా తుడవాలి.
* వంటగది షెల్ఫులు, తలుపులు రోజూ శుభ్రం చేస్తున్నా కూడా జిడ్డుపడుతుంటాయి. నెలకోసారి లీటరు వేడినీటిలో ఒక చెంచా అమ్మోనియా, రెండు చెంచాల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో పోసుకుని జిడ్డుగా ఉన్న ప్రదేశాల్లో స్ప్రే చేసి తడి పీల్చుకునే పొడి వస్త్రంతో తుడవాలి.
* గారపట్టిన సింకులు, టైల్స్, బాత్ టబ్బులను శుభ్రం చేయడానికి నాలుగు లీటర్ల వేడినీటిలో ఒక చెంచా అమ్మోనియా కలిపి వాడాలి.