క్రీడాభూమి
ఐఓసీ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జెనీవా, మార్చి 22: అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్ క్రీడా జ్యోతి ప్రజ్వలన, రిలే కార్యక్రమాలను నిర్వహించడాన్ని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. నిజానికి రిలే కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఐఓసీని టోక్యో ఒలింపిక్ కమిటీ కోరింది.
అయితే, చివరి క్ష ణం వరకూ ఐఓసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, హడావుడిగా మాజీ స్విమ్మర్ నవోకో ఇమోటోతో సరిపుచ్చింది. యూనిసెఫ్ అధికార ప్రతినిధిగా ఆమె ఏథెన్స్‌లోనే ఉన్నందున జపాన్ ఊపిరి పీల్చుకుంది. క్రీడా జ్యోతి రిలేను వాదాయి వేయకుండా, అనుకున్న సమయానికే నిర్వహించడం ద్వారా ఐఓసీ ప్రపంచ దేశాల ఐక్యతను చాటి చెప్పిందని ఇటలీ కేం ద్రంగా ఉన్న యూరోపియన్ ఒలింపిక్ కమిటీ ల అధికారులు వ్యాఖ్యానించారు. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ తీసుకున్న ఈ నిర్ణయా న్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అయితే, బ్రిటన్‌కు చెందిన మాజీ రోయర్ మాథ్యూ పినె్సట్ తదితరులు ఐఓసీ తీరును తప్పుపట్టారు.
ఒకవైపు కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం తల్లడిల్లిపోతుంటే, ఐఓసీకి చీమకుట్టినట్టయినా లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. అథ్లెట్ల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటం ఆడడం మంచిది కాదని అన్నారు. ఏదైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఇలావుంటే, షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకూ టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని ఐఓసీ అధికారులు వ్యాఖ్యానించడం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఈ వ్యాఖ్యలను సమర్థించింది. ఒలింపిక్స్ అనుకున్న షెడ్యూల్‌ను అనుసరించే జరుగుతాయని ఐఓసీ ధీమా వ్యక్తం చేసింది. కానీ, భారత బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య చీఫ్ సెబాస్టియన్ కో తదితరులు ఒలింపిక్స్‌ను వాయిదా వేయక తప్పదని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ తీవ్రతను పరిగణలోకి తీసుకొని, క్రీడాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్స్‌ను వా యిదా వేయడం మినహా మరో మార్గం లేదని వారు వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌కు అథ్లెట్ల ను పంపుతామని ఆస్ట్రేలియా ఒలింపిక్ సం ఘం ప్రకటించగా, అమెరికా ఒలింపిక్ సం ఘం అనుమానం వ్యక్తం చేసింది. విదేశీ ప్ర యాణాలపై ఆంక్షలు ఎప్పటి వరకూ కొనసాగుతాయో తెలియదని, కాబట్టి ఇప్పుడే ఒలింపిక్స్‌కు అథ్లెట్లను పంపే విషయంపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అమెరికా ఒలింపిక్ సంఘం తెలిపింది. మొత్తం మీద ఒ లింపిక్స్ నిర్వాహణ, ఐఓసీ తీరును కొంత మంది సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.