క్రీడాభూమి
దివాలా దిశగా సాకర్ క్లబ్‌లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. క్రికెట్, రగ్బీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, బాడ్మింటన్ వంటి ఎన్నో విభాగాల్లో టోర్నీలు, సిరీస్‌లు రద్దవుతున్నాయి. ఐరోపా దేశాల్లో అ త్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ ఇప్పుడు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నది. ఫస్ట్, సెకండ్ డివిజన్ క్లబ్‌లకు భా రీ నష్టాలు తప్పడం లేదు. అయితే, ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉన్న ఈ క్లబ్‌లు కొంత వరకూ నిలదొక్కుకోవచ్చు. కానీ, థర్డ్, ఫోర్త్ డివిజన్ క్లబ్‌లు మాత్రం దివాలా దిశగా నడుస్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బతో అన్ని స్థాయిల్లోనూ మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ప్రకటించిన తర్వాత, థర్డ్, ఫోర్త్ డివిజన్ క్లబ్‌లో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. స్పెయిన్ లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. కొన్ని స్పానిష్ థర్డ్ డివిజన్ జట్లు ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్యాకేజీలను కూడా ప్రకటించాయి. సాకర్ మ్యాచ్‌ల రద్దు కారణంగా ఎదురైన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొన్ని క్లబ్‌లు రాబోయే సీజన్‌లో జరగాల్సిన డెర్బీ పోటీల టికెట్లను అమ్మకానికి పెట్టాయి. ఫస్ట్ డివిజన్, సెకం డ్ డివిజన్ క్లబ్‌లు కూడా నష్టపోయినప్పటికీ, ఆర్థిక మూ లాలు బలంగా ఉండడం వల్ల మరికొంత కాలం నిలదొక్కుకునే అవకాశం ఉంది.
కానీ, థర్డ్, ఫోర్త్ డివిజన్ క్లబ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని స్పెయిన్ థర్డ్ డివిజన్ క్లబ్ బర్గోస్ క్లబ్ అధ్యక్షుడు ఫ్రాన్కో కాసెలీ వాపోతున్నాడు. బ్రాడ్‌కాస్టింగ్ హక్కులుగానీ, పెద్దపెద్ద స్పాన్సర్లుగానీ లేని క్లబ్‌లు మూతపడే ప్రమాదం ఉందని అంటున్నాడు. చిన్నపాటి క్లబ్‌ల ఆదాయం మొత్తం టికెట్ల అమ్మకంపైనే ఆధారపడి ఉంటుందని, మ్యాచ్‌లు రద్దుకావడంతో కొన్ని క్లబ్‌లు ఆటగాళ్ల జీతాల్లో కోత పెడితే, మరికొన్ని అసలు జీతాలే చెల్లించలేని దారుణ పరిస్థితికి చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చిన్నపాటి సాకర్ క్లబ్‌లు నిలువునా మునగిపోతుంటే, స్పెయిన్‌లో ఇలాంటి క్లబ్‌ల సంఖ్య ఎక్కువగా ఉం ది. ఆటగాళ్లు, కోచ్‌లు, గ్రౌండ్ సిబ్బందిసహా ఎంతో మంది కి ఉపాధి కల్పిస్తున్న ఈ క్లబ్‌లు దివాలా స్థితికి చేరుకోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. కరోనా వైరస్ ప్రభా వం మరికొంత కాలం కొనసాగితే, థర్డ్, ఫోర్త్ డివిజన్ క్లబ్‌లు మూతపడక తప్పదు.