క్రీడాభూమి

కష్టాల్లో గుజరాత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మార్చి 3: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో సౌరాష్టన్రు ఢీకొంటున్న గుజరాత్ కష్టాల్లో పడింది. కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన సౌరాష్ట్ర మ్యాచ్‌పై పట్టు బిగించగా, నాలుగో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 127.4 ఓవర్లలో 304 పరుగులు సాధించగా, అందుగు సమాధానంగా గుజరాత్ 87.3 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీనితో సౌరాష్టక్రు అత్యంత విలువైన 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆ జట్టు 98.4 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వాసవాద 139 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. చేతన్ సకారియా 45, చిరాగ్ జానీ 51 చొప్పున పరుగులు చేశారు. సౌరాష్ట్ర నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ ఏడు పరుగులకే ఓ వికెట్ కోల్పోయింది. ప్రియాంక్ పాంచల్ పరుగుల ఖాతాను తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సమిత్ గొహెల్ (5), భార్గవ్ మెరాయ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా, చేతిలో ఉన్న తొమ్మిది వికెట్లతో ఇంకా 320 పరుగులు చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్నది. ఈ జట్టు ఆలౌటైనా, లేక మ్యాచ్‌ని డ్రాగా ముగించినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు వెళుతుంది. మరో రకంగా చెప్పాలంటే, చివరి రోజున లక్ష్యాన్ని ఛేదిస్తేనే గుజరాత్‌కు ఫైనల్‌లో చోటు దక్కుతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఇది సాధ్యమయ్యే అవకాశాలు లేవు.