S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/26/2020 - 23:21

దుబాయి, ఫిబ్రవరి 26: టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. తాజాగా అంత ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ర్యాంకుల్లో విరాట్ ఒక స్థానం దిగజారి 906 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో కోహ్లీ నిరాశ పరిచిన విష యం తెలిసిందే.

02/26/2020 - 05:21

ఢాకా: బంగ్లాదేశ్‌లో టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో పాల్గొనే ఆసియా ఎలెవెన్ జట్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌సహా మొత్తం ఆరుగురికి చోటు లభించింది. కోహ్లీ ఎంపికపై ఎవరికీ అనుమానాలు లేవు. అయితే, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న రిషభ్ పంత్‌కు చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

02/25/2020 - 23:52

నవీ ముంబయి, ఫిబ్రవరి 25: విదేశీ లీగ్‌లపై భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా దృష్టి సారిస్తున్నాడు. గత వారం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అతను, విదేశాల్లో టీ-20 టోర్నీల్లో ఆడాలని ఉందని చెప్పాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అంగీకరిస్తేనే వెళతానని స్పష్టం చేశాడు.

02/25/2020 - 23:50

కోల్‌కతా, ఫిబ్రవరి 25: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కర్నాటకను ఎదుర్కోవడానికి ఎలాంటి మార్పులు లేని జట్టునే బెంగాల్ ఎంపిక చేసింది. ఈడెన్ గార్డెన్ మైదానంలో శనివారం నుంచి కర్నాటకతో ప్రారంభమయ్యే రంజీ సెమీ ఫైనల్లో పేసర్ ఆకాష్ దీప్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకోవచ్చు. ఒడిశాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను స్వల్ప గాయం కారణంగా ఆడలేకపోయాడు.

02/25/2020 - 23:49

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఇటలీకి శిక్షణ కోసం వెళ్లిన భారత బాక్సర్లను ‘కరోనా’ వైరస్ భయం వెంటాడుతున్నది. అయితే, భారత హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాడు. 13 మంది బాక్సర్లు, సుమారు డజను మంది అధికారులతో కూడిన భారత బాక్సింగ్ బృందం ప్రస్తుతం ఇటలీలోని ఉంబ్రియాకు సమీపంలో ఉన్న అస్సిసీలో ఉన్నారు.

02/25/2020 - 23:48

చెన్నై, ఫిబ్రవరి 25: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అతను మాత్రం మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సమాయత్తం అవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతను మార్చి రెండో తేదీ నుంచి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాడు. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత ధోనీ కెరీర్ గందరగోళంలో పడిన విషయం తెలిసిందే.

02/25/2020 - 23:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: డేవిస్ కప్ టోర్నమెంట్‌లో క్రొయేషియాతో ఆడే భారత జట్టులో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ సభ్యుడిగా ఉంటాడు. ప్లేయింగ్ స్క్వాడ్‌లోనే అతనిని కొనసాగించాలని నిర్ణయించినట్టు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జాబితాను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు పంపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. వచ్చేనెల 6-7 తేదీల్లో క్రొయేషియాతో భారత్ ఢీ కొంటుంది.

02/25/2020 - 23:45

భువనేశ్వర్, ఫిబ్రవరి 25: ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో భాగంగా మంగళవారం మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో పోటీపడిన సాధ్వీ ధురీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో రెండు స్వర్ణాన్ని అందుకున్న ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సావిత్రిబాయి ఫూలే పుణే వర్సిటీని అగ్రస్థానంలో నిలిపింది.

02/25/2020 - 01:44

పెర్త్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ను మట్టికరిపించిన హర్మన్ సేన, సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నూ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 142 పరుగులు చేసింది.

02/25/2020 - 01:42

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 24: అంతా ఊహించినట్లే జరిగింది. న్యూజిలాండ్ పర్యటనలో ప్రపంచ నెం.1 జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభా గాల్లో చతికిలబడ్డ కోహ్లీసేన మరో రోజు మిగిలి ఉండగా నే ప్రత్యర్థి బౌలర్ల ముందు తలవంచింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా 1-0 తేడాతో వెనుజంలో నిలిచింది.
మరో 47 పరుగులే..

Pages