క్రీడాభూమి

కర్నాటకతో రంజీ సెమీస్‌కు మార్పులేని బెంగాల్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 25: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కర్నాటకను ఎదుర్కోవడానికి ఎలాంటి మార్పులు లేని జట్టునే బెంగాల్ ఎంపిక చేసింది. ఈడెన్ గార్డెన్ మైదానంలో శనివారం నుంచి కర్నాటకతో ప్రారంభమయ్యే రంజీ సెమీ ఫైనల్లో పేసర్ ఆకాష్ దీప్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకోవచ్చు. ఒడిశాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను స్వల్ప గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో, తుది జట్టులో అతను ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గతంలో రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు 2017-18 సీజన్‌లో చివరిసారి సెమీ ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. ఆతర్వాత మళ్లీ ఇప్పుడు సెమీస్ చేరిన ఈ జట్టుకు కర్నాటక నుంచి గట్టిపోటీ ఎదురుకావడం ఖాయం. క్వార్టర్స్‌లో జమ్మూకాశ్మీర్‌ను ఓడించి, మంచి ఊపుమీద ఉన్న కర్నాటక జట్టు ఓపెనర్ లోకేష్ రాహుల్ రాకతో బలోపేతమైంది. ఈ జట్టును అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వంలోని బెంగాల్ జట్టు ఎంత వరకూ సమర్థంగా ఎదుర్కొంటుందో చూడాలి.