క్రీడాభూమి

సాధ్వీకి మరో స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఫిబ్రవరి 25: ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో భాగంగా మంగళవారం మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో పోటీపడిన సాధ్వీ ధురీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో రెండు స్వర్ణాన్ని అందుకున్న ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సావిత్రిబాయి ఫూలే పుణే వర్సిటీని అగ్రస్థానంలో నిలిపింది. ఈ వర్సిటీ 7 స్వర్ణాలు, రెండు రజతాలు, మరో ఐదు కాంస్యాలతో మొత్తం 14 పతకాలు గెల్చుకొని నంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తున్నది. తొలి రోజు స్వర్ణ పతకం సాధించిన సిద్ధాంత్ సెజ్వాల్ మంగళవారం మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో, పంజాబ్ వర్సిటీ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఐదు కాంస్యాలతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ 6 స్వర్ణాలు, ఐదు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం 12 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్‌కు చెందిన దామినీ గౌడ నుంచి ఎదురైన తీవ్రమైన ప్రతిఘటనను అధిగమించి, స్వర్ణాన్ని సాధించిన సాధ్వీ 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లోనూ అదే తరహా ఆధిపత్యాన్ని కనబరచింది. తన సమీప ప్రత్యర్థి కంటే కేవలం 0.60 సెకన్ల ముందుగా ఆమె లక్ష్యాన్ని చేరి, విజేతగా నిలిచింది.
*చిత్రం...రెండో స్వర్ణం సాధించిన సాధ్వి ధురీ