S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/20/2020 - 23:02

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 20: సమవుజ్జీల సమరంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టును పేర్కోవచ్చు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఎవరూ ఊహించలేకపోతున్నది. కాగితంపై చూస్తే, టెస్టు ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బలంగా కనిపిస్తున్నది.

02/20/2020 - 01:56

వెల్లింగ్టన్: వచ్చే మూడేళ్లలో జట్టుకు నా సహకారం ఎంతో అవసరమని, మరో మూడేళ్ల వరకు అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడతానని, ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శుక్రవారం నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్టు జరగనున్న సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత ఏదైన ఫార్మాట్ నుంచి తప్పుకుంటారా?

02/19/2020 - 23:43

న్యూజిలాండ్‌తో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం సాధన చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు వెల్లింగ్టన్ వేదికగా ప్రారంభం కానుండగా, రెండోది క్రిస్ట్‌చర్చ్‌లో జరగనుంది. సుధీర్ఘ పర్యటనలో భాగంగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయగా, మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

02/19/2020 - 23:42

కొలొంబో, ఫిబ్రవరి 19: వెస్టిండీస్‌తో ఈ నెల 22 నుంచి స్వదేశంలో ప్రారంభమయ్యే వనే్డ సిరీస్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్ ధనుష్క గుణతిలక దూరమయ్యాడు. వెన్నునొప్పి కా రణంగా గుణతిలక సిరీస్ నుంచి తప్పుకున్న ట్లు శ్రీలంక బోర్డు పేర్కొంది. మూడు మ్యా చ్‌ల వనే్డ సి రీస్‌లో భాగంగా 15మంది సభ్యులతో కూడి న జట్టును ఎంపిక చేసింది. వనే్డ సిరీస్ తర్వా త ఇరుజట్లు రెండు టీ20 మ్యాచ్‌లను ఆడనున్నాయ.

02/19/2020 - 23:30

టోక్యో, ఫిబ్రవరి 19: టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా భయం వెంటాడుతున్నది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకూ జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అథ్లెట్లు పోటీపడతారు. ఆరు వందలకుపైగా సభ్యులతో కూడిన బృందాన్ని పంపనున్నట్టు చైనా ఇది వరకే ప్రకటించింది.

02/19/2020 - 00:12

బ్రిస్బేన్స్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండి యా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతీ మంధాన (4) తక్కువ స్కోరుకే అవుటై నిరాశ పరిచింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరింది.

02/18/2020 - 23:55

*చిత్రం... న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా 55 కేజీల విభాగంలో సౌదీ అరేబియా బాక్సర్ తౌర్కి అలీతో తలపడుతున్న భారత రెజ్లర్ అరుణ్ హలకుర్కి.

02/18/2020 - 23:53

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 18: న్యూజిలాండ్ సీనియర్ ఆల్‌రౌండర్ రాస్ టేలర్ 2023 ప్రపంచకప్ ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌తో టేలర్ సరికొత్త రికార్డు సాధించనున్నాడు. ఈ నెల 21 నుంచి మొదలయ్యే తొలి టెస్టు టేలర్‌కు 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అయతే మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా నిలవనున్నాడు.

02/17/2020 - 23:22

దుబాయ, ఫిబ్రవరి 17: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసి న ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో కేవలం 105 పరుగులు మాత్రమే చేయడంతో 9వ స్థానం నుంచి దిగజారి 673 రేటింగ్ పాయంట్లతో 10వ స్థానంలో నిలిచాడు. మరో వైపు యువ ఆటగాడు కేఎల్ రాహుల్ 823 రేటింగ్ పాయంట్లతో తన రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

02/17/2020 - 23:21

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 17: దక్షిణాఫ్రికా కెప్టెన్, స్టార్ ప్లేయర్ ఫఫ్ డుప్లెసిస్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇక నుంచి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకొని, ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని ప్రకటించి క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డును షాక్‌కు గురిచేశాడు. గత కొద్ది రోజుల క్రితమే తాను ఈ విషయమై సరైన నిర్ణయం తీసుకుంటానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

Pages