-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
శ్రీనగర్‌లో జరుగుతున్న ఐ లీగ్ మ్యాచ్‌లో భాగంగా సోమవారం తలపడుతున్న రియల్ కాశ్మీర్ ఎఫ్‌సీ (ఎడమ), ఇండియన్ ఆరోస్ జట్లు. ఈ మ్యాచ్‌లో రియల్ కాశ్మీర్ 1-0 తేడాతో విజయం సాధించింది.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలిన కోహ్లీసేన రెండోఇన్నింగ్స్‌లోనూ అదే తడ ‘బ్యాటు’కు గురై, మరోసారి నిరాశ పరిచింది. ప్రస్తుతం మూడో రోజు ఆటలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
లంబూకు ఐదు..
*చిత్రం... న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన మారథాన్‌లో పాల్గొన్న వారితో
ఫొటోలకు ఫోజులిచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.
ఒంగోలు, ఫిబ్రవరి 23: మరో క్వార్టర్ ఫైనల్‌లో ఆంధ్రాతో తలపడు తున్న సౌరాష్ట్ర జట్టు భారీ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆటలో ప్రేరక్ మన్‌కడ్ (85), ధర్మేంద్రసింగ్ జడేజా (60), వికెట్ కీపర్ అవి బరోత్ (54) అర్ధ సెంచరీల తో చెలరేగడంతో 9 వికెట్లు కోల్పోయ 375 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చి న 283 పరుగులు కలుపుకొని ప్రస్తు తం 658 పరుగుల ఆధిక్యంలో నిలి చింది.
వల్సాద్, ఫిబ్రవరి 23: రంజీట్రోఫీ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్‌లో గుజరాత్ జట్టు గోవాపై 464 పరుగుల భారీ విజయా న్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజ రాత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయ 602 పరుగులు చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత సూపర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో అతను ఒక్క వికెట్ కూడా సాధించలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బుమ్రాను సమర్థుడైన బౌలర్‌గా అంగీకరించడానికి వీల్లేదని అభిమానులు సైతం మండిపడ్డారు. అతనిపై వస్తున్న విమర్శలకు కారణం లేదని చెప్పడానికి వీల్లేదు.
ఐలీగ్ సిరీస్‌లో భాగంగా శ్రీనగర్ స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ఇండియన్ ఆరోస్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు. ఈ సిరీస్‌లో భాగంగా ఇండియన్ ఆరోస్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు రియల్ కాశ్మీర్‌తో తలపడనుంది.
న్యూఢిల్లీ: ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లిం గ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శనివారం మరో స్వర్ణ పతకం లభించింది. 57 కిలోల విభాగంలో పోటీ పడిన రవి దహి యా 10-0 తేడాతో తజకిస్థాన్‌కు చెందిన హికుమాతుల్లో వహి దోవ్ నుంచి చిత్తు చేసి, స్వర్ణ పతకం అందుకున్నాడు. అతని ధా టికి వహిదోవ్ ఏ దశలోనూ ఎదురు నిలువలేకపోయాడు.
వెల్లింగ్టన్, ఫిబ్రవరి 22: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 165 పరుగులకే ఆలౌటైన భారత జట్టు ఎదురుదాడికి దిగింది. ఇశాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌ను కట్టడి చేశాడు. అయితే, కేన్ విలియమ్‌సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్‌ను ఆదుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌పై కివీస్ 51 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది.
కటక్, ఫిబ్రవరి 22: దేశంలో క్రీడా విప్లవం మొదలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మొట్టమొదటి ‘ఖేలో ఇండియా’ యూనివర్శిటీ గేమ్స్‌ను శనివారం ప్రారంభించిన మోడీ ప్రసంగిస్తూ, క్రీడా విప్లవంలో దీనిని తొలి అడుగుగా అభివర్ణించారు. 159 విశ్వవిద్యాలయాలకు చెందిన 3,400 మంది అథ్లెట్లు 17 విభాగాల్లో పోటీపడుతున్న మెగా టోర్నమెంట్ వల్ల యువతలో క్రీడాభిమానం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.