S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/16/2020 - 02:27

రాంచీ, ఫిబ్రవరి 15: యువ అథ్లెట్ భవనా జాట్ ఈ ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్‌కు క్వాలిఫై అయింది. జాతీయ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా శనివారం 20 కిలోమీటర్ల నడకలో పాల్గొన్న 23 ఏళ్ల భావన తన లక్ష్యాన్ని ఒక గంట, 31 నిమిషాల్లో చేరుకొని సంచలనం సృష్టించింది. స్వర్ణ పతకాన్ని అందుకోవడమేగాక, కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది.

02/16/2020 - 02:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ ఫిట్నెస్ పరీక్షను విజయవంతంగా ముగించాడు. త్వరలోనే న్యూజిలాండ్‌లో ఉన్న టీమిండియాను కలుసుకుంటాడు. గత నెల 21న, రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున విదర్భతో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇశాంత్ కుడి కాలి మడమ బెణికింది.

02/16/2020 - 02:24

హామిల్టన్, ఫిబ్రవరి 15: న్యూజిలాండ్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ రెండో రోజు భారత పేసర్ మహమ్మద్ షమీ చక్కటి ప్రతిభ కనబరచి మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, నవ్‌దీప్ సైనీ తలా రెండేసి వికెట్లు కూల్చడంతో, కివీస్ ఎలెవెన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 235 (74.2 ఓవర్లు) పరుగులకు ఆలౌటైంది.

02/14/2020 - 04:47

కర్నాటకలోని లాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో జరిగిన ఏటీపీ చాలెంజర్ టూర్స్ బెంగళూరు ఓపెన్ 2020లో భాగంగా గురువారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో స్వీడెన్‌కు చెందిన అండ్రీ గోరన్సన్, ఇండోనేసియా క్రీడాకారుడు క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ జంటపై విజయం సాధించిన అనంతరం భారత్‌కు చెందిన లియాండర్ పేన్, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్.

02/14/2020 - 04:46

హామిల్టన్, ఫిబ్రవరి 13: న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్, ఆ తర్వాత జరిగిన వనే్డ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అయతే ఇప్పటికీ ఓటమి నుంచి బయటపడని కోహ్లీసేన, ఈ నెల 21 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. దీనికి ముందు నేటి నుంచి కివీస్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది.
ఓపెనర్లు ఎవరు?

02/14/2020 - 04:43

రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ మహిళల ట్రోఫీ-2020 టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తలపడుతున్న ఫ్రాన్స్ క్రీడాకారిణి అలైజ్ కార్నెట్, గ్రీస్‌కు చెందిన మరియా సక్కారి. మరో మ్యాచ్‌లో బెల్జియంకు చెందిన అలిసన్ వాన్ యుట్వాంక్‌తో తలపడుతున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా.

02/14/2020 - 04:38

నడియాడ్: రంజీట్రోఫీలో భాగంగా ఆంధ్రా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.

02/14/2020 - 04:37

హైదరాబాద్, ఫిబ్రవరి 13: రంజీట్రోఫీలో భాగంగా హైదరాబాద్ జట్టుతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ కెప్టెన్, ఓపెనర్ ఫయజ్ ఫజల్ (126, నాటౌట్) సెంచరీ సాధించాడు. అంతకుముందు హైదరాబాద్ జట్టు 272 పరుగులకు ఆలౌటైంది. ప్రతీక్ రెడ్డి (83) ఆకట్టుకున్నాడు.

02/13/2020 - 07:03

దుబాయ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వనే్డ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. భారత్ నుంచి కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలను దక్కిం చుకున్నారు.

02/13/2020 - 07:01

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 12: ముక్కో ణపు టీ20 సిరీస్‌లో భాగంగా బుధ వారం ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండి యా 11 పరుగుల తేడాతో పరాజ యం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ (71, నాటౌట్), అష్లే గార్డ్‌నర్ (26), కెప్టెన్ మెగ్ లన్నింగ్ (26) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 155 పరుగులు చేసింది.

Pages