క్రీడాభూమి

టెస్టు సిరీస్‌లో రాణించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 13: న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్, ఆ తర్వాత జరిగిన వనే్డ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అయతే ఇప్పటికీ ఓటమి నుంచి బయటపడని కోహ్లీసేన, ఈ నెల 21 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. దీనికి ముందు నేటి నుంచి కివీస్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది.
ఓపెనర్లు ఎవరు?
కీలక ఆటగాళ్లంతా గాయాల బారిన పడ డంతో టీమిండియా పరిస్థితి దారుణంగా మా రింది. న్యూజిలాండ్ పర్యటనకు ముందే రె గ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో టో ర్నీ నుంచే నిష్క్రమించగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ సైతం మోచేయ గాయం కార ణంగా టోర్నీ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చిం ది. అయతే కివీస్ పర్యటనలో ఆద్యంతం ఆకట్టుకున్న బ్యాకప్ ఓపెనర్, వికెట్ కీపర్ లోకేష్ రాహుల్‌ను సైతం టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఓపెన ర్‌గా ఎవరు బరిలోకి దిగుతారనేది ప్రశ్నార్థ కంగా మారింది. ఇటీవల జరిగిన టీ20 సిరీ స్‌కు ఎంపికైన మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలిద్దరూ విఫలం కావడం టీమ్ మేనేజ్ మెం ట్‌ను ఆలోచనలో పడేసింది. అయతే పూర్తి స్థాయలో విఫలమైన మయాంక్ అగర్వాల్‌ను పక్కనబెట్టి, న్యూజిలాండ్ ఏ జట్టుతో రాణిం చిన శుభ్‌మన్‌గిల్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభిం చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాం డ్ ఏతో జరిగిన మ్యాచుల్లో శుభ్‌మన్ చక్కగా రాణించాడు. మరోవైపు టీ20 సిరీస్ లో పెద్ద స్కోర్లేమీ చేయకపోయనా పృథ్వీ షా ఆక ట్టుకోవడంతో వీరిద్దరి తోనే టెస్టుల్లో ఓపెనింగ్ చేయంచే అవకాశాలు లేకపోలేదు. అయతే మయాంక్ అగర్వాల్‌కు 9 టెస్టులు ఆడిన అనుభవం ఉండడంతో జట్టు మేనేజ్‌మెంట్ తుది జట్టుకు ఎవరికి అవకాశమిస్తుందో చూడాలి.
పంత్.. సాహా..?
మరోవైపు పొట్టి క్రికెట్‌తో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా ఆకట్టుకున్న లోకేష్ రాహుల్, అటు బ్యాట్స్‌మన్‌గా విజ యవంతమయ్యాడు. దీంతో మేనేజ్‌మెంట్ సహా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం కొద్దిరోజులు వికెట్ కీపర్‌గానూ రాహు ల్ అదనపు బాధ్య తలు మోయాల్సి వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. అయతే తాజాగా టెస్టు సిరీస్ జట్టు లో రాహుల్ లేకపోవడంతో కథ మళ్లీ మొ దటికొచ్చింది. గత సిరీస్‌ల్లో వరుస అవకాశా లిచ్చినా రాణించని రిషభ్‌పంత్‌ను పక్కన బె ట్టి, గాయం నుంచి కోలుకున్న వృద్ధిమాన్ సా హాను తీసుకున్నారు. ప్రస్తుతం కివీస్ పర్యట నలో వీరిద్దరి పేర్లు జట్టులో ఉండడంతో తుది జట్టుకు ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రశ్నార్థ కంగానే మిగిలింది. గత టెస్టు సిరీస్‌లో సాహా రాణించడం కూడా అతడికి కలిసొచ్చింది.
బలమైన బ్యాటింగ్ లైనప్..
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే టెస్టు జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ప్రత్య ర్థి జట్టు కంటే బలంగా కనిపిస్తోంది. రెగ్యు లర్ ఓపెనర్లు లేకపోయనా యువ కులతో ఇన్నింగ్స్ ప్రారంభించనున్న టీమిండియాకు టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరా ట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, వృద్ధి మాన్ సాహాతో పాటు ఆల్‌రౌండర్లు హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బు మ్రా, ఉమేశ్ యాదవ్‌తో పాటు స్పిన్ విభాగం లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి సేవలందించనున్నారు.
జోరుమీదున్న కివీస్..
సొంత గడ్డపై టీ20 సిరీస్‌ను కోల్పోయనా, తిరిగి పుంజుకొని వనే్డ సిరీస్‌ను క్లీన్‌స్వీ ప్ చేసి న్యూజిలాండ్ జట్టు జోరుమీద కనిపిస్తోంది. ప్రస్తుతం జట్టులో ఆటగాళ్లంతా ఫాంతో ఉండ డం కివీస్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు జట్టులోకి కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి రావ డం అదనపు బలం.
టీమిండియాదే పైచేయ..
టెస్టుల్లో ఇరు జట్ల రికార్డులు పరిశీలిస్తే టీమిండియానే ఇప్పటివరకు పైచేయ సాధిం చింది. ఇరు జట్లు మొత్తం 57 సిరీస్‌ల్లో తలప డగా, భారత్ 21, న్యూజిలాండ్ 10 టెస్టుల్లో విజయం సాధించాయ. ఇందులో 26 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయ. చివరిసారిగా 2016లో తలపడగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.