క్రీడాభూమి

దిగజారిన కోహ్లీ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, ఫిబ్రవరి 17: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసి న ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో కేవలం 105 పరుగులు మాత్రమే చేయడంతో 9వ స్థానం నుంచి దిగజారి 673 రేటింగ్ పాయంట్లతో 10వ స్థానంలో నిలిచాడు. మరో వైపు యువ ఆటగాడు కేఎల్ రాహుల్ 823 రేటింగ్ పాయంట్లతో తన రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ లో 56 సగటుతో 224 పరుగులు చేశాడు. మొత్తం మీద భారత్ తరఫున విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరు మాత్రమే టాప్-10లో నిలిచారు. ఇదిలాఉంటే పాకిస్తాన్ స్టార్ ఆటగా డు బాబర్ అజామ్ 879 రేటింగ్ పాయంట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకోగా, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (810), న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ కొలిన్ మున్రో (785), గ్లేన్ మ్యాక్స్‌వెల్ (766), డేవిడ్ మలన్ (718), ఎవిన్ లుయాస్ (702), హజ్రతుల్లా (692), ఇయాన్ మోర్గాన్ 687 రేటింగ్ పాయంట్లతో ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కొనసాగుతున్నారు.
పాక్ ఫస్ట్, ఆసిస్ సెకండ్..
జట్ల పరంగా చూస్తే 270 రేటింగ్ పాయంట్లతో పాకిస్తాన్ జట్టు తొలి స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా (269), ఇంగ్లాండ్ (265), భారత్ (264), దక్షిణాఫ్రికా (262) రేటింగ్ పాయంట్లతో రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయ. ఇక తాజాగా భారత్‌పై టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన న్యూజిలాం డ్ 245 రేటింగ్ పాయంట్లతో 6వ స్థానంతో సరిపెట్టుకోగా, అఫ్గానిస్తాన్ (236), శ్రీలంక (236) జట్లు సంయుక్తంగా రేటింగ్ పాయంట్లు సాధించి, 7. 8 స్థానాలతో సరిపెట్టుకున్నాయ. బంగ్లాదేశ్ (226), వెస్టిండీస్ (223) టాప్-10 లో చివరి రెండు స్థానాల్లో నిలిచాయ. ఇక టా ప్-10 బౌలర్ల జాబితా, ఆల్‌రౌండర్ల జాబితా లో టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కలేదు.
*చిత్రం... కేఎల్ రాహుల్