క్రీడాభూమి

ఆసియా ఎలెవెన్ జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: బంగ్లాదేశ్‌లో టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో పాల్గొనే ఆసియా ఎలెవెన్ జట్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌సహా మొత్తం ఆరుగురికి చోటు లభించింది. కోహ్లీ ఎంపికపై ఎవరికీ అనుమానాలు లేవు. అయితే, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న రిషభ్ పంత్‌కు చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కాగా, ఈ జట్టులో లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ కూడా చోటు సంపాదించుకున్నారు. ‘బంగబంధు’ ముజిబుర్ రహ్మాన్ శత జయంతి ఉత్సవాలు వచ్చేనెల 18 నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆసియా ఎలెవెన్, వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్ జరగనుంది. వరల్డ్ ఎలెవెన్ జట్టుకు ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వం వహిస్తాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ అందుబాటును బట్టి ఒక మ్యాచ్‌లో ఆడతాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రకటించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అతను మ్యాచ్ ఆడేదీ లేనిదీ ఇంకా ప్రకటించలేదు. బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మంగళవారం ప్రకటించిన జాబితాలో భారత క్రికెటర్లకే పెద్దపీట వేశారు. కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆడాలని బీసీబీ కోరుతున్నది. అయితే, తీరికలేని షెడ్యూల్‌తో బిజీగా ఉన్న అతను కనీసం ఒక్క మ్యాచ్ ఆడినా చాలని భావిస్తున్నది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా, రెండో టెస్టు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వస్తుంది. మార్చి 12న ధర్మశాలలో మొదలయ్యే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఆ సిరీస్‌లో రెండో వనే్డ 15న లక్నోలో, చివరిదైన మూడో వనే్డ 18న కోల్‌కతాలో జరుగుతాయి. ఆతర్వాత, 29 నుంచి ఐపీఎల్ మొదలవుతుంది. ఇంత బిజీ షెడూల్ మధ్య, కోహ్లీ ఎన్ని మ్యాచ్‌లు ఆడగలుగుతాడు? అసలు ఆ ఈవెంట్‌కు వెళతాడా లేదా అన్న ప్రశ్న ఎదురవుతున్నాయి. ఇలావుంటే, వరల్డ్ ఎలెవెన్ జట్టులో డు ప్లెసిస్‌తోపాటు క్రిస్ గేల్స్, కీరన్ పొలార్డ్ వంటి హేమాహేమీలు ఉన్నారు. ఆసియా ఎలెవెన్‌లో ఒక్క పాకిస్తాన్ క్రికెట్ కూడా లేకపోవడం గమనార్హం.
ఆసియా ఎలెవెన్ జట్టు: విరాట్ కోహ్లీ, రిభష్ పంత్, లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, తిసర పెరెరా, లసిత్ మలింగ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ముస్త్ఫాజు రహ్మాన్, తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, సందీప్ లామిచానే.
వరల్డ్ ఎలెవెన్ జట్టు: ఫఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), నికొలస్ పూరన్, బ్రెండన్ టేలర్, జానీ బెయిర్‌స్టో, కీరన్ పొలార్డ్, అదిల్ రషీద్, షెల్డన్ కాంట్రెల్, లున్గీ ఎన్డిగీ, ఆండ్రూ టై, అలెక్స్ హాలెస్, క్రిస్ గేల్.
*చిత్రాలు.. విరాట్ కోహ్లీ *రిషభ్ పంత్