క్రీడాభూమి

ప్లేయింగ్ స్క్వాడ్‌లో పేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: డేవిస్ కప్ టోర్నమెంట్‌లో క్రొయేషియాతో ఆడే భారత జట్టులో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ సభ్యుడిగా ఉంటాడు. ప్లేయింగ్ స్క్వాడ్‌లోనే అతనిని కొనసాగించాలని నిర్ణయించినట్టు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జాబితాను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు పంపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. వచ్చేనెల 6-7 తేదీల్లో క్రొయేషియాతో భారత్ ఢీ కొంటుంది. ఈ జట్టులో పేస్‌సహా మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. రిజర్వ్ ఆటగాడిగా దివిజ్ శరణ్ జట్టు ఎంపికయ్యాడు. కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ ఇప్పటికే దివిజ్‌తో ఈ విషయాన్ని చర్చించినట్టు ఏఐటీఏ తెలిపింది. సుమీత్ నాగల్, ప్రజ్ఞేష్ గునే్నశ్వరన్, రాంకుమార్ రామనాథన్ సింగిల్స్ విభాగంలో పోటీపడతారని, పేస్, భూపతి డబుల్స్ విభాగంలో ఆడతారని వివరించింది. గత ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ పోటీలకు బొపన్న హాజరుకాలేదు. గాయం వేధిస్తున్నందువల్లే తాను వైదొలగుతున్నట్టు అప్పట్లో అతను ప్రకటించాడు. ఆ సమయంలోనే దివిజ్ వివాహం జరిగింది. అందుకే, అతను కూడా గత ఏడాది డేవిస్ కప్ టోర్నీలో ఆడలేదు.

*చిత్రం...లియాండర్ పేస్