క్రీడాభూమి

బాక్సర్లకు ‘కరోనా’ భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఇటలీకి శిక్షణ కోసం వెళ్లిన భారత బాక్సర్లను ‘కరోనా’ వైరస్ భయం వెంటాడుతున్నది. అయితే, భారత హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాడు. 13 మంది బాక్సర్లు, సుమారు డజను మంది అధికారులతో కూడిన భారత బాక్సింగ్ బృందం ప్రస్తుతం ఇటలీలోని ఉంబ్రియాకు సమీపంలో ఉన్న అస్సిసీలో ఉన్నారు. వచ్చేనెల జోర్డాలో ఒలింపిక్ క్వాలిఫయర్స్ జరుగుతాయి. నిజానికి ఈ నెలలోనే ఉహాన్‌లో ఈ పోటీలు ప్రారంభం కావాల్సి ఉండింది. అయితే, ఆ ప్రాంతం నుంచే భయంకరమైన కరోనా వైరస్ ప్రబలడంతో అధికారులు పోటీలను వాయిదా వేశారు. వేదికను జోర్డాన్‌కు మార్చి, వచ్చేనెల మూడో తేదీ నుంచి పోటీలు మొదలవుతాయని ప్రకటించారు. కాగా, ఇటలీలో కరోనా వైరస్ సోకిన ఏడుగురు ఇప్పటికే మృతి చెందగా, 229 మంది చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న భారత బాక్సర్లు ఆందోళనకు గురవుతున్నారని, అందుకే, అనుకున్న తేదీ కంటే ముందుగానే జోర్డాన్‌కు బయలుదేరి వెళ్లాలని కోరుతున్నారని సమాచారం. దీనిపై నీవా స్పందిస్తూ, తాము ఇటలీ అధికారులను సంప్రదించామని, కరోనా వైరస్ కేసులున్న ప్రాంతానికి ఉంబ్రియా చాలా దూరంలో ఉందని వారు స్పష్టం చేశారని అన్నాడు. ఎలాంటి భయాందోళనలు లేకుండా బాక్సర్లు శిక్షణ కొనసాగించవచ్చని చెప్పినట్టు నీవా తెలిపాడు. బాక్సర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాము కూడా షెడ్యూల్ ప్రకారం బుధవారం ఇటలీకి బయలుదేరతామని ప్రకటించాడు.