క్రీడాభూమి

2 నుంచి ధోనీ ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 25: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అతను మాత్రం మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సమాయత్తం అవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతను మార్చి రెండో తేదీ నుంచి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాడు. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత ధోనీ కెరీర్ గందరగోళంలో పడిన విషయం తెలిసిందే. జాతీయ సెలక్షన్ కమిటీ అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు. మరోవైపు అతను రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. దీనితో, ఎంతకాలం అతను రిటైర్మెంట్‌ను వాయిదా వేస్తాడనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతున్నది. వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత ధోనీకి టీమిండియాలో చోటు దక్కలేదు. ఈ ఏడాది జనవరిలో ఆటగాళ్లకు బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టు జాబితాలోనూ అతనికి అవకాశం లభించలేదు. దీనిని అవమానంగా భావించి, ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, అతను ఏమాత్రం స్పందించలేదు. ఇలావుంటే, జట్టు సహచరులతో కలిసి ఐపీఎల్ కోసం ధోనీ రెండో తేదీ నుంచి చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెడతాడని చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి విశ్వనాథన్ ప్రకటించాడు. పూర్తి స్థాయిలో క్యాంప్ 19వ తేదీ నుంచి మొదలవుతుందని తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో మార్చి 29న జరిగే మ్యాచ్‌తో చెన్నై తన తాజా ఐపీఎల్ యాత్ర మొదలు పెడుతుందని చెప్పాడు. సురేష్ రైనా, అంబటి రాయుడు తదితరులు కూడా ధోనీతోపాటు మార్చి రెండు నుంచే ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ జొష్ హాజెల్‌వుడ్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ క్యూరెన్, తమిళనాడు ఎడమచేతి వాటం స్పిన్నర్ సాయి కిషోర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే.

*చిత్రం... మహేంద్ర సింగ్ ధోనీ