క్రీడాభూమి

ఒలింపిక్స్ వాయిదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: ఒలింపిక్స్‌పైన కూడా కరోనా వైరస్ పంజా విసురుతుందా? అత్యంత భయంకరమైన ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడతాయా? ఈ అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒలింపిక్స్ జూలై 24 నుంచి, పారాలింపిక్స్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్‌లోనూ కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో, పరిస్థితి ఎటు నుంచి ఎటు తిరుగుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒలింపిక్స్ నిర్వాహణ బాధ్యతల శాఖ మంత్రి సీకో హషిమోతో జపాన్ పార్లమెంట్ ఎగువ సభలో చేసిన ప్రకటన పలు అనుమానాలకు తావిస్తున్నది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో టోర్నీలు, సిరీస్‌లు వాయిదా పడడం లేదా రద్దవుతున్న విషయం తెలిసిందే. కొన్ని క్వాలిఫయింగ్ ఈవెంట్స్ కూడా వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో, టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే, సజావుగా సాగుతాయా? లేక వాయిదా పడతాయా? అన్న ప్రశ్నపై మంత్రి హషిమోతో స్పందించింది. ఈ ఒలింపిక్స్ ఈ ఏడాదే జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించింది. అయితే, ముందుగా అనుకున్నట్టు జూలైలో జరగకుండా వాయిదాపడే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేసింది. జపాన్‌లో ఇప్పటికే 12 మంది కరోనా వైరస్ సోకి మృతి చెందారు. దీనితో చాలా వరకు స్కూళ్లు, క్రీడా ప్రాంగణాలు మూతపడ్డాయి. ఒలింపిక్స్‌ను నిర్వహించే వివిధ స్టేడియాలు కూడా మనుషులు లేక బోసిపోతున్నాయి. చైనాలోని ఊహన్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 70 దేశాలకు వ్యపించిన ఈ వైరస్ కారణంగా 3,100 మంది మృతి చెందారు. తొంభై వేలకుపైగా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి రోజురోజు తీవ్రమవుతున్న నేపథ్యంలో, టోక్యో ఒలింపిక్స్ వాయి దా పడినా ఆశ్చర్యం లేదని హషిమోతో పార్లమెంటు ఎగువ సభలో స్పష్టం చేసింది. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని, అప్పటిలోగా వైరస్ అదుపులోకి వస్తే, ముందుగా అనుకున్న షెడ్యూల్‌కే గేమ్స్ మొదలవుతాయని తెలిపింది. ఇలావుంటే, అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ మాత్రం గే మ్స్ నిర్వాహణపై ధీమాతో ఉన్నాడు. కరోనా వైరస్ త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశాభాం వ్యక్తం చేశాడు. పైగా, అన్ని విధాలా పరీక్షించిన తర్వాతే అథ్లెట్లను అనుమతిస్తామని పేర్కొన్నాడు. ఒలింపిక్స్‌ను వాయిదా వేయాల్సిన అవసరం తనకు ఏమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించాడు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవానికి సిద్ధంగా ఉన్నామని, ఆ స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని ఓ ప్రకటనలో బాచ్ తెలిపాడు. కానీ, ఆయన అభిప్రాయాలను జపాన్ మీడియా ఖండిస్తున్నది.