S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/14/2019 - 05:16

జోహానె్నస్‌బర్గ్, ఆగస్టు 13: భారత్‌తో జరిగే టెసు, టీ20 సిరీస్‌లకు కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో సఫారీ జట్టు మూడు టీ20, మూడు టెస్టులు ఆడనుంది. ప్రపంచకప్‌లో ఘోర ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టులో భారీ మార్పులు చేసింది. ప్రధాన కోచ్ గిబ్సన్ కాంట్రాక్టును పొడిగించడం లేదని స్పష్టం చేసింది.

08/13/2019 - 04:25

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత రికార్డులన్నింటినీ చెరిపేస్తున్నాడు. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా కెప్టెన్ తాజాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రెండో అంతర్జాతీయ వనే్డలో మరో రెండు రికార్డులను సవరించాడు.

08/13/2019 - 04:23

న్యూఢిల్లీ, ఆగస్టు 12: గత కొంతకాలంగా భారత జట్టును నాలు గో స్థానం వేధిస్తోంది. ఈ స్థానంలో వచ్చిన ఆటగాళ్లేవారు రాణించక పోవడంతో కీలక సమయం లో జట్టు కష్టాల్లో పడుతోంది. అయతే టీమిం డియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాత్రం ఈ స్థానంలో యువ ఆట గాడు శ్రేయస్ అయ్యర్‌ను ఆడిస్తే బాగుంటుందని, అతడు కచ్చితంగా సరిపోతాడని పేర్కొన్నాడు.

08/13/2019 - 00:53

లండన్‌లోని లార్డ్స్ మైదానంలో సోమవారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం నెట్స్‌లో తమ రగ్బీ జట్టు కోసం జరిగిన వీడియో చిత్రీకరణలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులు. ముందు వరుసలో మధ్యలో రగ్బీ బంతిని పట్టుకుని కూర్చున్న ఆసిస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్.

08/12/2019 - 23:58

దుబాయ్, ఆగస్టు 12: ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా అవతరిం చిన తర్వాత ఐసీసీ (అంతర్జాతీయ క్రి కెట్ కౌన్సిల్) సోమవారం పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్ 2ను ప్రారం భించింది. 2023 ప్రపంచకప్ కోసం ఈ నాలుగేళ్లలో ఆయా జట్లు అర్హత సాధించేందుకు పోటీ పడనున్నాయ. లీగ్-2లో మొత్తం 7 జట్లు నమీబియా, నేపాల్, ఓమన్, పపువా న్యూగినియా, స్కాట్‌లాండ్, యూఏఈ, యూఎస్‌ఏ జట్లు పోటీ పడతాయ.

08/12/2019 - 23:58

వడోదర, ఆగస్టు 12: భారత ఆతి థ్యమిస్తున్న 6వ ఆసియన్ స్కూల్ టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన 96మంది క్రీడాకారులు పాల్గొంటున్న ట్లు సోమవారం టెబుల్ టెన్నిస్ అసో సియేషన్ ఆఫ్ బరోడా అధ్యక్షురాలు (టీటీ ఆబీ) జయబిన్ థక్కార్ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నా డు.

08/12/2019 - 23:57

చిత్రం..యాషెస్ సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి జరిగే రెండో టెస్టు కోసం లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు. *(ఇన్‌సెట్లో) నెట్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్.

08/12/2019 - 23:49

చిత్రం...మాంట్రియల్‌లో జరిగిన రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యాకు చెందిన డెనిల్ మెద్వెదేవ్‌పై గెలిచిన స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ విజయానందం

08/11/2019 - 23:40

అమస్టర్‌డామ్, ఆగస్టు 11: తను కోలుకునేందుకు మరో ఆరు వారాల సమయం పట్టనుందని టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. మోకాలి నొప్పితో గత కొద్దిరోజులు ఆటకు దూరంగా ఉన్న రైనా ఇటీవలే నెదర్లాండ్స్‌లో చికిత్స చేయంచుకొని కోలుకుంటు న్నాడు. ఈ సందర్భంగా 32 ఏళ్ల రైనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ లేఖను విడుదల చేశాడు.

08/11/2019 - 23:41

దుబాయ, ఆగస్టు 11: టీ20 క్రికెట్‌లో మరో సరికొత్త రికార్డు నమోదైంది. నెదర్లాం డ్స్, థాయ్‌లాండ్ మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఈ రికార్డుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టును 54 పరుగులకే కుప్పకూ ల్చిన థాయ్‌లాండ్ జట్టు, ఆ తర్వాత 8 ఓవర్ల లోనే 2 వికెట్లను నష్టపోయ విజయం సాధిం చింది. ఈ మ్యాచ్ విజయం థాయ్‌లాం డ్ జట్టుకు వరుసగా 17వది కావడం విశేషం.

Pages