క్రీడాభూమి

అమిత్, లలీనాకు కాంస్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమాన్ (జోర్డాన్), మార్చి 10: ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ పోటీపడిన ప్రపంచ నంబర్ వన్ అమిత్ పంఘల్ పురుషుల 52 కిలోమీటర్ల విభాగంలో, లలీనా బొర్గొహైన్ మహిళల 69 కిలోల విభాగంలో కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. వీరు తమతమ విభాగాల్లో సెమీ ఫైనల్స్ చేరుకున్న వెంటనే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. అయితే, ఇద్దరూ సెమీస్‌లో పరాజయాలను ఎదుర్కొన్నారు. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం సెమీస్‌లో వీరిద్దరూ కాంస్య పతకాలు దక్కించుకున్నారు. తన సెమీ ఫైనల్ పోరులో చైనాకు చెందిన జియాంగువాన్ హూతో తలపడిన అమిత్ చివరి క్షణం వరకూ అద్భుతంగా పోరాడాడు.
చివరికి 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. కాగా, ఇది వరకు రెండు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలను సాధించిన లలీనా సెమీ ఫైనల్లో హాంగ్ గూ (చైనా) చేతిలో 0-5 తేడాతో ఓటమిపాలైంది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న హాంగ్ ఈ ఫైట్‌లో ప్రారంభం నుంచి చివరి వరకూ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆమె విజృంభణకు లలీనా ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది.
*చిత్రాలు.. అమిత్ పంఘల్
*లలీనా బొర్గొహైన్