క్రీడాభూమి
సంతోష్ ట్రోఫీ చివరి రౌండ్ వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 March 2020
న్యూఢిల్లీ, మార్చి 10: కరోనా వైరస్ భయం వెంటాడుతుండగా, ముందు జాగ్రత్త చర్యగా 2019-20 సీజన్ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ చివరి రౌండ్ మ్యాచ్‌లను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) వాయిదా వేసింది. ఈ విషయాన్ని అన్ని సభ్య సంఘాలకు నోటీసు ద్వారా వెల్లడించింది. ఆటగాళ్ల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, అందుకే, ఐజ్వాల్‌లో జరగాల్సిన చివరి రౌండ్‌ను వాయిదా వేస్తున్నామని ఏఐఎఫ్‌ఎఫ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సంతోష్ ట్రోఫీ చివరి రౌండ్ వాయిదాను మిజోరం ఫుట్‌బాల్ సంఘం ధ్రువీకరించింది. ఏఐఎఫ్‌ఎఫ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నదని, మ్యాచ్‌లను ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే వెల్లడిస్తుందని పేర్కొంది.