క్రీడాభూమి

ఐపీఎల్ జరిగేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించొద్దంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైం ది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 29 నుం చి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వహిం చడానికి బీసీసీఐకి కేంద్రం అనుమతిని ఇవ్వొద్దం టూ మద్రాస్ హైకోర్టులో న్యాయవాది అలెక్స్ బెంజిగర్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, కృష్ణన్ రామస్వామి డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టే అవకాశముం ది. ప్రపంచ ఆరోగ్య వెబ్‌సైట్‌లో కరోనాకు మందును కను గొన్నట్లు నమోదు కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. కరో నా అంటువ్యాధిలా ప్రపంచమంతా వేగం గా వ్యాప్తిస్తుం దని, దీని ప్రభావంతో ప్రతిష్టాత్మక ఇటలీ ఫెడరేషన్ లీగ్‌ను కూడా ఆ దేశ ప్రభుత్వం మైదానంలోకి అభిమానులను అనుమతించకుండా నిర్వహిస్తుందని తెలిపారు. ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐకి అనుమ తించవద్దని ప్రతిపా దించినా, ఇప్పటికీ ఎలాంటి సమాధా నం రాలేదని పిటిష న్‌లో పేర్కొన్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. లీగ్‌ను వాయదా వేయా లని మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. తాజాగా కర్నాటక ప్రభుత్వం సైతం ఐపీఎల్ నిర్వహణకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్టల్రోనూ శివసేన టికెట్ల విక్రయాలను అడ్డుకున్నట్లు సమాచారం.