S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/08/2019 - 00:14

దుబాయ్ : ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభాపాటవాలు కనబరచిన భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సోమవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి ఎగబాకాడు. ఇది అతినికి కెరీర్‌బెస్ట్ ర్యాంకు.

10/08/2019 - 00:12

*చిత్రం...హైదరాబాద్‌లో సోమవారం నాడు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న భారత బాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు

10/08/2019 - 00:11

ఉలాన్-ఉడే (రష్యా), అక్టోబర్ 7: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల 48 కిలోల విభాగంలో భారత బాక్సర్ మంజురాణి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించారు. చివరి 16వ స్టేజీలో తలపడిన ఈ ఆరో సీడ్ భారతీయ మహిళ 5-0 స్కోరుతో వెనిజులాకు చెందిన రోజాస్ టయోనిస్ సిడెనోను మట్టికరిపించింది. విశ్వవిఖ్యాత వేదకపై తొలి ప్రయత్నంలోనే పతకాన్ని కైవసం చేసుకునే అవకాశం ఆమెకు ఇక కేవలం ఒక విజయానికి దూరంలో ఉంది.

10/08/2019 - 00:06

దుబాయ్, అక్టోబర్ 7: వన్‌డే మ్యాచుల్లో ఐసీఐసీ మహిళల క్రికెట్ జట్ల తాజా ర్యాంకింగ్స్ సోమవారం నాడిక్కడ విడుదలయ్యాయి. ఇందులో భారత మహిళ జట్టు రెండో స్థానంలో కొనసాగడంతోబాటు మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు కంటే పాయింట్ల లీడ్‌ను మెరుగుపరుచుకుంది. మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు 125 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, 123 పాయింట్లతో ఇంగ్లాండ్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది.

10/08/2019 - 00:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత మాజీ బ్యాంటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం యువతేజం మయాంక్ అగర్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ఏ మాత్రం జంకులేని తెంపరితనంతో కూడిన మయాంక్ బ్యాటింగ్ తీరు వీరేంద్ర సేవాగ్‌ను తలిపిస్తోంద’ని లక్ష్మణ్ కితాబిచ్చాడు. కర్మాటక రంజీ జట్టుకు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నాడు.

10/07/2019 - 08:50

విశాఖపట్టణం : ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల భారీ ఆధిక్యంతో విజయభేరి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది.

10/06/2019 - 23:37

బీజింగ్, అక్టోబర్ 6: ప్రపంచ నెంబర్ వన్ నవోమి ఒసాకా ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆస్ట్లే బార్టీని 3-6, 6-3, 6-2 తేడాతో ఓడించింది. తొలి సెట్‌ను చేజార్చుకున్న నవొమి మిగతా రెండు సెట్లలో ప్రత్యర్థిపై విరుచుకుపడి సునాయాసంగా గెలుపొందింది.

10/06/2019 - 23:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత క్రికెట్ సంఘం (ఐసీఏ)కు జరుగనున్న ఎన్నికల జోరు ఊపందుకుంది. ఈనెల 11న జరిగే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పోటీదారులంతా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇటీవల రిటైరైన ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లకు కూడా పెన్షన్, వైద్యం వంటి సదుపాయాలతోపాటు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఎక్స్‌గ్రేషియాను కూడా ఇప్పిస్తానని మాజీ టెస్ట్ క్రికెటర్ కీర్తి ఆజాద్ హామీ ఇచ్చాడు.

10/06/2019 - 23:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఇటీవల సవరణలు చేసిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నియమావళి ప్రకారం ఎవరు ఏమి చేయాలో శాసించే అధికారం పాలనాధికారుల బృందం (సీఓఏ)కు లేదని తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) స్పష్టం చేసింది.

10/06/2019 - 23:34

ఉలాన్-ఉడే (రష్యా), అక్టోబర్ 6: భారత స్టార్ బాక్సర్ సరితాదేవి ఇక్కడ జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ నుంచి నిష్క్రమించింది. 60 కేజీల విభాగంలో పోటీపడిన ఈ మాజీ చాంపియన్ ఆదివారం రష్యాకు చెందిన నతాలియా షెడ్రినా చేతిలో ఓటమిపాలైంది. బౌట్ ఆరంభం నుంచి చివరివరకు ఏ దశలోనూ సరిత ఎదురుదాడి చేయలేకపోయింది. దీంతో షెడ్రినా ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించింది.

Pages