క్రీడాభూమి

ఐఎస్‌ఎల్ విజేత ఏటీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్గావ్, మార్చి 14: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏటీకే కైవసం చేసుకుంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా మిగతా టోర్నీలు, సిరీస్‌లను వాయదా వేసిన అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) శనివారం నాటి ఐఎస్‌ఎల్ ఫైనల్‌ను ఖాళీ స్టే డియంలో నిర్వహించింది. ప్రేక్షకుల కేరింతలు, ప్ల కార్డుల ప్రదర్శనలు లేకుండా సాదాసీదాగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏటీకే 3-1 గోల్స్ తేడాతో తన చిరకా ల ప్రత్యర్థి చెనె్నయన్ ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. ఈ జట్టు చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. ఐఎస్‌ఎల్‌లో అత్యధిక పర్యాయాలు విజేతగా నిలిచిన జట్టుగా ఏటీకే రికార్డు సృష్టించింది. ఫైనల్లో ప్రారంభం నుంచే దాడికి ఉపక్రమించిన ఏటీకేకు 10వ నిమిషంలో జేవియర్ హెర్నాండెజ్ తొలి గోల్‌ను అందించాడు. ఆతర్వాత ఏటీకే పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, చెనె్నయన్ గోల్స్ కోసం విఫల యత్నాలు చేసింది. ఈ సంకుల సమరం కారణంగా ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం ప్రారంభంలోనే ఎదూ గార్సియా ద్వారా ఏటీకేకు మరో గోల్ లభించింది. 48వ నిమిషంలో అతను గోల్ చేయడంతో, ఏటీకే 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అయతే, నెరినీ వాల్క్‌కిస్ 69వ నిమిషంలో చెనె్నయన్‌కు గోల్ అందించాడు. అతను ఆధిక్యాన్ని తగ్గించగలిగాడుగానీ ఏటీకే విజయాన్ని నిలువరించకలేపోయాడు. ఇంజురీ టైమ్‌లో హెర్నాండెజ్ మరో గోల్ చేయడంతో ఏటీకే 3-1 తేడాతో గెలుపొందింది.