క్రీడాభూమి

ధైర్యంగా ఉండండి.. వైరస్‌పై పోరాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనా వైరస్‌పై పోరాటం సాగించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. వైరస్ సోకకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అతను ట్వీట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు వేల మందికిపైగా మృతి చెందగా, భారత్‌లో ఇప్పటి వరకూ 80 పాజిటిక్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, విపత్కర పరిస్థితిని ప్రజలంతా ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలని అన్నాడు. వైరస్ సోకిన తర్వాత చికిత్స తీసుకునే కంటే, అది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని కోహ్లీ వ్యాఖ్యానించాడు. తొలుత నిర్ధారించిన షెడ్యూల్ ప్రకారం శనివారం సాయంత్రం భారత జట్టు నెట్ ప్రాక్టీస్‌కు హాజరుకావాల్సి ఉండింది. కానీ, ఈలోపే ఇరు దేశాల క్రికెట్ అధికారులు పరస్పర అంగీకారంతో మిగతా రెండు వనే్డలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో టీమిండియా క్రికెటర్లు తమకు కేటాయించిన హోటల్ రూమ్స్‌కే పరిమితమయ్యారు. ఇలావుంటే, మాజీ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ కూడా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశాడు. ఏ మాత్రం అనుమానాస్పద లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించాడు. కరోనా వైరస్‌ను అందరం కలసికట్టుగా అరికడదామని అతను అన్నాడు.
*చిత్రం... టీమిండియా కెప్టెన్ కోహ్లీ