S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/22/2020 - 04:01

న్యూఢిల్లీ, మార్చి 21: సాధారణంగా జరిపే డోప్ పరీక్షలను ఇప్పుడు 25 శాతం తగ్గించినట్టు జాతీయ డోపింగ్ నిరోధక ఏజన్సీ (నాడా) ప్రకటించించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ల్యాబ్‌లను అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపాడు.

03/22/2020 - 04:00

ఓస్లో, మార్చి 21: కరోనా వైరస్ ఉధృతి తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ ఒలింపిక్స్‌ను వాయిదా వేయక తప్పదని నార్వే ఒ లింపిక్ కమిటీ (ఎన్‌ఓసీ) అభిప్రాయపడింది. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఈ వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ ఒలింపిక్స్ నిర్వహణకు ఎలాంటి చర్య లు తీసుకోవద్దని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ)కి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్‌కు లేఖ రాసిం ది.

03/20/2020 - 05:01

ఏథెన్స్: టోక్యో ఒలింపిక్స్ క్రీడా జ్యోతి రిలే సంప్రదాయబద్ధమైన గాన, నృత్యాది కార్యక్రమాల తర్వాత ప్రారంభమైంది. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) అధికారులు దానిని అధికారికంగా జపాన్ ప్రతినిధికి అందచేయడంతో, రిలే మొదలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ అర్టెమిస్ ఇగ్నాటియో సంప్రదాయసిద్ధమైన దుస్తులతో, లాంఛనాలన్నీ పూర్తి చేసుకొని, జ్యోతి అప్పగింత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

03/20/2020 - 04:59

ప్రాచీన ఒలింపిక్స్ కేంద్రంలో రెపరెపలాడుతున్న ఆధునిక ఒలింపిక్స్‌కు జన్మస్థానమైన ఏథెన్స్, ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ), ఈ ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ పతాకాలు. ఇక్కడ వెలిగిన ఒలింపిక్ జ్యోతి వివిధ దేశాల మీదుగా టోక్యో చేరుకుంటుంది

03/20/2020 - 04:54

*ఏథెన్స్‌లో టోక్యో ఒలింపిక్స్ 2020 క్రీడా జ్యోతిని అధికారులకు అందించే కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ అర్టెమిస్ ఇగ్నాటియో

03/20/2020 - 04:51

బెంగళూరు, మార్చి 19: ఒలింపిక్స్ కోసం వచ్చే వారం ప్రారంభమయ్యే శిక్షణా శిబిరానికి హాజరవుతామని భారత మహిళా హాకీ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ కారణంగా పలు అన్ని రకాల క్రీడా ఈవెంట్స్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు కూడా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు.

03/20/2020 - 04:50

న్యూఢిల్లీ, మార్చి 19: కరోనా వైరస్ తీవ్రత రోజురోజు కూ పెరుగుతున్న నేపథ్యంలో, టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే మంచిదని భారత బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్‌ను జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వ రకూ నిర్వహించాల్సి ఉంటుంది.

03/19/2020 - 06:27

గ్రీస్‌లోని ఏథెన్స్ వద్ద సంప్రదాయ పద్ధతిలో ఒలింపిక్ జ్యోతిని ప్రజ్వలింపజేసిన తర్వాత దానిని జపాన్‌కు తరలిస్తున్న ప్రత్యేక విమానం.
‘టోక్యో 2020 గో’ పేరుతో ఒలింపిక్ రిలే ప్రారంభం కానుంది. అయితే, ముందుగా నిర్దేశించిన మార్గం నిడివిని కుదించి కొత్త రిలే షెడ్యూల్‌ను
ప్రకటించనున్నట్టు జపాన్ ఒలింపిక్ కమిటీ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా

03/19/2020 - 06:02

పారిస్: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన వివిధ టోర్నీలు, సిరీస్‌ల జాబితాలో ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ కూడా చేరింది. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, ముందుజాగ్రత్త చర్యగా ఈ టోర్నమెంట్‌ను వాయిదా వేస్తున్నట్టు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్‌ఎఫ్‌టీ) అధ్యక్షుడు బెర్నార్డ్ గిడియసెల్లీ ప్రకటించాడు.

03/18/2020 - 23:30

న్యూయార్క్: ఫ్రెంచ్ ఓపెన్ మాదిరిగానే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 13వరకు యూఎస్ ఓపెన్‌ను ఫ్లషింగ్ మెడోస్ కేంద్రంలోని బిల్లీ జీన్ కింగ్ కోర్టులో నిర్వహించాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నీని వాయిదా వేసే ఆలోచనలో యూఎస్ టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఏ) ఉందని సమాచారం.

Pages