క్రీడాభూమి
సౌరాష్ట్ర 425 ఆలౌట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజ్‌కోట్, మార్చి 11: బెంగాల్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ ఫైనల్ మ్యాచ్ల్ సౌరాష్ట్ర జట్టు మూడో రోజు బుధవారం 425 పరుగులు చేసి ఆలౌట్ అయంది. ధరేంద్ర జానీ (33) పరుగులతో అజేయంగా నిలిచినా, చిరాగ్ జానీ (14), ప్రేరక్ మన్కాడ్ 90), కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ (20) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన బెంగాల్ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయ 134 పరుగులు చేసింది. సుదీప్ చటర్జీ (47), వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (4) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు సుదీప్ కుమార్ గార్మి (26), అభిమాన్యూ ఈశ్వరన్ (9) నిరాశ పర్చగా, మనోజ్ తివారీ (35) ఫర్వాలేదనిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో ధర్మేంద్ర సిన్హ్ జడేజా, ప్రేరక్ మన్కాడ్, చిరాగ్ జానీకి ఒక్కో వికెట్ దక్కింది.