క్రీడాభూమి

నెట్స్‌లో సచిన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 3: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ సెట్స్‌లో బ్యాటింగ్ చేసి, వాంఖడే స్టేడియంలో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన క్రికెట్ సిరీస్‌లో ఆడేందుకు అతను సమాయత్తమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత సచిన్ ప్రత్యక్షంగా ఒక సిరీస్‌లో ఆడడం ఇదే మొదటిసారి. సచిన్‌తోపాటు వీరేందర్ సెవాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, బ్రియాన్ లారా, శివనారాయన్ చందర్‌పాల్, బ్రెట్ లీ, బ్రాడ్ హాడ్జ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, తిలకరత్నే దిల్షాన్, అజంతా మేండిస్ వంటి ఎంతో మంది మాజీ క్రికెట్ స్టార్లు ఈ టోర్నమెంట్‌లో ఆడతారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చేపట్టిన ఈ క్రికెట్ టోర్నీకి విశేష స్పందన వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.